calender_icon.png 5 June, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణభవన్ వద్ద హరీశ్‌రావు ఫ్లెక్సీ తొలగింపు

04-06-2025 12:15:32 AM

మండిపడ్డ బీఆర్‌ఎస్ శ్రేణులు

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్‌రావు పుట్టిన రోజు సందర్భం గా ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది రాత్రికిరాత్రే తొలగించారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ భవన్ లోపల, బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఫ్లెక్సీలను తొలగించని అధికారులు, బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలను మాత్రం ఎందుకు తొలగిస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు. గాంధీభవన్, బీజేపీ పార్టీల కార్యాలయాల దగ్గర నెలల తరబడి ఉన్న ఫ్లెక్సీలను ఎందుకు తీసేయలేదన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచే స్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని వాపోయా రు.

రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభు త్వమేనని, అధికారులు చేసే పనులను గుర్తుపెట్టుకుంటున్నామ న్నారు. అతి ఉత్సాహాన్ని ప్రదర్శించే అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. హరీశ్‌రావు ఫ్లెక్సీలు చించడం ప్రభుత్వ చిల్లర చర్య అని, ప్రభుత్వ అలసత్వాన్ని, రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యాన్ని నిలదీసే నేత హరీశ్ రావుపే దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.