నవభారత్ కార్మిక యూనియన్ కమిటీని గుర్తించి కార్మికుల సమస్యలపై చర్చించాలి: సీఐటీయూ
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ ౮ (విజయక్రాంతి): పాల్వంచ నవభారత్ కార్మిక యూనియన్ సిఐటి యూ ఆద్వర్యంలో నవభారత్ మెయిన్ గేటుముందు నవభారత్ కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్బంగా సిఐటి యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె రమేష్, సిఐటియూ సీనియర్ నాయకులు ఎంవీ అప్పారావులు మాట్లాడుతూ.. నవభారత్ కర్మాగారంలో అనేక విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులుగా 5 నుండి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని అయినా కనీస వేతనాల అమలులో తీవ్ర నిర్లక్ష్యం ఎదుర్కొంటున్నారని, పనిభద్రత లేదని, గ్రాట్యుటీ లేదు, తీవ్రమైన వేధింపులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు,
ప్రమాద భీమా సౌకర్యం లేదని, శాశ్వత పని ప్రాంతాలలో కూడా కాంట్రాక్ట్ కార్మికుల్తోనే పని చేపిస్తున్నారని వివరించారు. సమాన పనికి సమాన వేతనం అమలవడం లేదని, నవభారత్ లో మహిళా ఉద్యోగులు నియామకాలు లేవు, ఫెర్రో అల్లాయిస్ లో 12/3 అగ్రిమెంట్ ప్రకారం 55 మంది కార్మికులు ఉండాల్సి ఉండగా 47 మంది మాత్రమే వున్నారన్నారు. మిగతా వారిని వెంటనే భర్తీ చేయాలని, చిన్న చిన్న కారణాలతో కార్మికులను పని నుండి తొలగిస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్బంగా యాజమాన్య ప్రతినిధులుగా వచ్చిన హెచ్ ఆర్ వారు అవస్తవాలు చెప్పపోగా కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వ్యతిరేకించారు. కర్మాగారంలో 10 సంవత్సరాలుగా పనిచేస్తూ కోల్ ప్లాంట్ లో పనివలన కాన్సర్ కు గురయ్యి ప్రాణాలతో పోరాడుతున్నాడని అతని పేరు సుంకనపల్లి ప్రవీణ్, కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియా వారికి ఏవిధమైన ఆర్థిక సహాకారం ఇవ్వలేదని ఇలాంటి అనేకమంది ఉన్నారని వారు అన్నారు.
సిఐటి యూ జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డా రవికుమార్, సిపీఎం పట్టణ కార్యదర్శి తులసి రాం, సిఐటియూ జిల్లా సహాయ కార్యదర్శి సత్య, సత్యవాణి, వింజా రాములు, నిరంజన్, కాంతి, నవభారత్ కార్మిక యూనియన్ నాయకులు గోపాల్, సుధీర్, సురేష్, యాకోబు, గుర్రం రాములు, యాకోబు, కవిత కుమారి పాల్గొన్నారు.






