7 September, 2026 | 5:16 AM

నర్సు కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి

07-09-2026 | 03:30am

ఎంపీ గోడెం నగేష్

ములకలపల్లి, సెప్టెంబర్ 6 (విజయక్రాం తి): అత్యాచారం,హత్యకు గురైన ఆదివాసీ నర్సు కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం,10 ఎకరాల భూమిని మ ంజూరు చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ (Adilabad MP Godem Nagesh) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చే శారు. హైదరాబాద్లో హత్యకు గురైన ములకలపల్లి మండలానికి చెందిన గిరిజన యు వతి ఊకే శిరీష కుటుంబ సభ్యులను ఆదివా రం భారతీయ జనతా పార్టీ నాయకులు,ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడెం నగేష్,

మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యు లు సీతారాం నాయక్,భద్రాద్రి జిల్లా అధ్యక్షు లు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి డా .విజయచంద్ర రెడ్డి,మహబూబాబాద్ పార్లమెంటు బీజేపీ మాజీ అధ్యక్షులు యాపా సీతయ్య,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుంజా ధర్మ, పోడియం బాలరాజు,ములకలపల్లి మ ండల అధ్యక్షులు గుగులోత్ శంకర్ నాయక్, లతో కలసి ఆదివారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ బాధిత కుటుంబానికి కేవలం రూ.5 లక్షల పరిహారం అందించి,ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చేతులు దులుపుకునే ప్రయ త్నం చేయడం సరికాదన్నారు. 

మరిన్ని వార్తలు