05-02-2026 12:00:00 AM
రేవల్లి ఫిబ్రవరి 4: గ్రామ అభివృద్ధిలో భాగంగా బుధవారం నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సుమారు రూ.20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ భవన పనులను గ్రామసర్పంచ్ మేకల కృష్ణయ్య, ఎంపీడీఓ కీర్తన కలిసి భూమి పూజ చేశారు. ఆధునిక వసతులతో కూడిన ఈ భవనాన్ని నిర్ణీత గ డువులోగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేస్తామని ఎంపీడీఓ తెలిపారు. నూతన భ వన నిర్మాణం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎం.రాధా ఆంజనేయులు, ఆర్ అం డ్ బి ఏఈ, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు