05-02-2026 12:00:00 AM
జనగామ, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ వారి ఆధ్వర్యంలో బాగా చదవండి నగదు బహుమతులు పొందండి అనే పత్రిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహ రెడ్డి, చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆ సంస్థ వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ప్రధమ బహుమతి పొందిన వారికి ఐదు లక్షలు ద్వితీయ బహుమతికి మూడు లక్షలు ప్రతి జిల్లా స్టాపర్ కు రెండు లక్షలు ప్రతి నియోజకవర్గ స్టాపర్ కు ఒక లక్ష రూపాయలు ప్రతి మండల ప్రథమ ర్యాంకర్ కు పదివేల నగదు బహుమతిగా శ్రీరామ్ సంస్థ అందజేయడం జరుగుతుంది అని అన్నారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీరామ్ సంస్థ వారు ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం ఎంతో ఆదర్శనీయం అన్నారు ఇవి పేద విద్యార్థుల పై చదువులకు ఇటువంటి బహుమతులు దోహదపడతాయని విద్యార్థులు మంచిర్యాంకు సాధించడానికి ప్రేరేపిస్తాయని ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ ప్రతినిధి రాజ్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ కోట రాజ్ కుమార్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు, పాల్గొనడం జరిగింది.