6 May, 2026 | 8:33 PM

విమానం ల్యాండింగ్ టైమ్‌లో మంటలు

07-10-2024 01:39 AM

శాన్‌డియాగో, అక్టోబర్ 6: కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో నుంచి లాస్‌వెగాస్‌కు బయలుదేరిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. హ్యారీరీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమ యంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపిం చింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పేశారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 190 మంది ప్యాసింజర్లు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. అందరినీ సురక్షితంగా బస్సు లో టెర్మినల్‌కు తరలించారు.