15 June, 2026 | 7:10 PM

Breaking News

సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •  

ప్రధాని సభ విజయవంతం చేయాలి

10-05-2026 01:12 AM

మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి: అమరం మోహన్ రెడ్డి

మేడ్చల్ అర్బన్, మే 9 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మేడ్చల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ప్రధాని బహిరంగ సభకు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ అధికారం చేపట్టిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుపునకు ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి ప్రచా రం చేయాలని ఆయన తెలిపారు. ఇప్పటి నుంచి రానున్న ప్రతి ఎన్నికల్లో భారతీయ జన తా పార్టీ గెలుపును ఎవరు ఆపలేరని మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.