నాణ్యత డొల్ల.. తలుపులేమో గుల్ల!
- చివరికి కంపలే తలుపులుగా..
అధికారులు పర్యవేక్షణ కరువు
భీమిని, ఏప్రిల్ 15: భీమిని మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది సౌకర్యార్థం నివాస గృహాలను ప్రభుత్వం లక్షలు వెచ్చించి నివాస గృహ సముదాయం నిర్మించారు. గుత్తేదారు నాసిరకం పనులు, అధికా రుల పర్యవేక్షణ లోపం వెరసి నివాస గృహల సముదాయం, తలుపులు చెదలు పట్టి గుల్లగా మారడంతో మూడునాళ్ల ముచ్చటగా దర్శనమిస్తున్నాయి.
అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారునికి ఇష్ట రాజ్యం వెరసి పనుల్లో నాణ్యత లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దీనికి భీమినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది, వసతి గృహ సముదాయ నిర్మాణం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది సౌకర్యార్థం రూ.90 లక్షలు డీఎంఎఫ్‌టి నిధులతో నిర్మించిన సిబ్బంది గృహ సముదాయం 2025 ఏప్రిల్ 5న ప్రారంభించారు.
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించేందుకు భవనాల తలుపులు ప్రారంభమైన సంవత్సరానికె తడిసి చెద పురుగులు పట్టడం తొ తలుపులు శిథిలావస్థకు చేరుకున్నాయి. భవనంలో ఉండేందుకు సిబ్బంది వెనుకడుగు వేస్తున్నారు.
నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం ఒకెత్తు అయితే, అధికారుల పర్యవేక్ష ణ కరువైందని, లక్షలాది రూపాయలు అభివృ ద్ధి పనులు నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. దీన్ని పర్యవేక్షించాల్సిన అధికారు లు ఇప్పటివరకు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నా యి. దీనితో సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షణ జరిపి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేస్తున్నారు.






