4 August, 2026 | 1:51 AM

ది రెడ్ బ్యాగ్.. నీ వెనకే..

04-08-2026 12:33 AM

మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవికుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. తాజాగా చిత్రబృందం ఈ మూవీలోని ‘నీ వెనకే’ అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సిధ్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను తిరుపతి జావన రాయగా, శేఖర్ మోపురి బాణీ సమకూర్చారు.