5 May, 2026 | 2:02 AM

వెస్ట్‌బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో కాషాయ జెండా రెపరెపలు

05-05-2026 12:00 AM
  1. గాంధీనగర్, అశోక్ నగర్‌లో బీజేపీ సంబురాలు
  2. హాజరైన రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్

ముషీరాబాద్, మే4 (విజయక్రాంతి): భారత రాజకీయ చరిత్రలో ఇది సరికొత్త సంచలనమని, మోదీ నాయకత్వంలో బెంగాల్‌లో బీజేపీ జయభేరి మోగించి, అస్సాం పుదుచ్చేరిలో కాషాయ జెండా ఎగురవేసిన సందర్భంగా  భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపా రు. ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు, రాజ్య సభ ఎంపీ డాక్టర్ కే.  లక్ష్మణ్  సోమవారం గాంధీనగర్ డివిజన్ అశోక్ నగర్ లోని వారి నివాసం వద్ద బీజేపీ నాయకులతో కలిసి టపాసులు కాల్చి,

స్వీట్లు పంపిణీ చేసి బీజేపీ విజయోత్సవ సంభారాలు  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి. భరత్ గౌడ్, బీజేపీ సికింద్రబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  ఎ. వినయ్ కుమార్, స్థానికులు స్వామి రావు, రాజేష్, నాయకులు సురేష్ రాజు, ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్, అరుణ్ కుమార్, ప్రశాంత్, శ్రవణ్, శక్తీసింగ్, లడ్డు, బీజేపీ కార్యకర్తలు సంబురాల్లో పాల్గొన్నారు.