బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేయాలి

11-09-2026 | 05:10am

బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

సిరిసిల్ల, సెప్టెంబర్ 10, (విజయ క్రాంతి): శాసనసభలో (Legislative Assembly) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాం డ్ చేశారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలను స స్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

శాసనసభ వ్యవహారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని సస్పెన్షన్ను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడటం దారుణమన్నారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ 14 ఏళ్లపాటు రాజీలేని పోరాటం చేశారని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని బీఆర్‌ఎస్ నేత గూడూరు ప్రవీణ్ అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి వారం రోజుల పాటు ప్రభుత్వ వైఫల్యాలను నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లామని తెలిపారు. రేవంత్రెడ్డి పాలన వద్దనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారని అన్నారు.

అసెంబ్లీ ఎదుట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, బొల్లి రామ్మోహన్, మీసరగండ్ల అనిల్కుమార్, కుంబాల మల్లారెడ్డి, రాజు, మ్యాన రవి, బాలమల్లు, సాయికుమార్, కందుకూరి రామాగౌడ్, అనిల్గౌడ్, మొగిలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు