4 May, 2026 | 2:47 AM

కేసీఆర్ తెచ్చిన సంక్షేమమే.. తెలంగాణకు మణిహారం

04-05-2026 01:29 AM
  1. కాంగ్రెస్‌కు చెందిన 150 మంది యువకులు బీఆర్‌ఎస్‌లో చేరిక
  2. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

జవహర్‌నగర్, మే 3 (విజయక్రాంతి): కెసిఆర్ తీసుకువచ్చిన సంక్షేమమే తెలంగాణకు మణిహారమైందని కాంగ్రెస్ పై ప్రజల్లో ఆదరణ తగ్గిందని ప్రజా పాలనను తిరస్కరిస్తూ బిఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాబోయేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ప్రజా సమస్యలపై కొట్లాడుతూ ప్రజల సమస్యలను తీర్చేది రాబోయే బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ శాంతినగర్ ప్రాంతానికి చెందిన తమిళనాడు నుండి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న తమిళ సోదరులు 150 మంది కార్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీ జవహర్ నగర్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బోయిన్పల్లి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మాజీ మంత్రి చామ కూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ జాతిపిత కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి ప్రస్తుతం కనిపించడం లేదని తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత ఒక్క కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ మేకల కావ్య, జిల్లా నాయకుడు ఆలూరి రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ పల్లపు రవి, జిట్టా శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ సభ్యులు శోభారెడ్డి, ఉపాధ్యక్షుడు రంగుల సతీష్, ప్రధాన కార్యదర్శి రెడ్డి శెట్టి మహేష్, యూత్ జనరల్ సెక్రటరీ దిలీప్, అహ్మద్, విలాసాగర్ రవి, సతీష్, మురుగన్ తదితరులు పాల్గొన్నారు.