4 May, 2026 | 2:55 AM

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

04-05-2026 01:30 AM

పట్టణ సిఐ కె శివశంకర్ 

కోదాడ మే 3, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి అలవాటులను అలవర్చుకోవాలని పట్టణ సీఐ కె శివశంకర్ అన్నారు. కోదాడ పట్టణ బాలల ఉన్నత పాఠశాలలో జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి ఉచిత వాలిబాల్ శిక్షణ కేంద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించి మాట్లాడారు. గ్రౌండ్ ని నమ్ముకున్న వారు ఎప్పుడు చెడిపోరని మంచి అలవాటుకు దగ్గరగా ఉంటారని మీరందరూ ప్రతిరోజు క్రీడ కోసం సాధన చేయటం అభినందనీయమని అన్నారు అదేవిధంగా ప్రతిరోజు క్రీడాకారులకుపౌష్టిక ఆహారాన్ని అందిస్తున్న మాజీ వైస్ ఎంపీపీ సీనియర్ సిపిఐ నాయకులు భద్రం భద్రారెడ్డి  ఆయన ఈ సందర్భంగా అభినందించారు ఈ కార్యక్రమంలో కోచులు సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు వాకర్ సభ్యులు పాల్గొన్నారు.