2 March, 2026 | 1:31 PM

హుండీలు తాళాలు పగులగొట్టి చోరీ

02-03-2026 10:43 AM

వాంకిడి శివాలయంలో ఘటన ఆలస్యంగా వెలుగు

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలంలోని శివకేశవ ఆలయంలో జరిగిన చోరీ(Theft ) ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 20న ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో మొత్తం ఐదు హుండీలు ఉండగా, అందులో మూడు హుండీల తాళాలను పగులకొట్టి డబ్బును దోచుకెళ్లినట్లు ఆలయ పూజారి మనోజ్ పాండే తెలిపారు. ఈ ఘటనపై ఆలయ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఘటనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.