ముగిసిన కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ పోటీలు
ముఖ్యఅతిథులుగా హాజరైన ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆదర్శ్ రెడ్డి
పటాన్ చెరు: అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో బీఆర్‌ఎస్ యువనేత మాణిక్ యాదవ్(BRS youth leader Manik Yadav) ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ(KCR Cricket Trophy) పోటీలు ఘనవిజయంగా ముగిశాయి. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 59 జట్లు పాల్గొని ఉత్సాహంగా పోటీ పడ్డాయి. ఫైనల్ మ్యాచ్‌లో ఐలాపూర్ వారియర్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. పాండు 11 జట్టు రన్నరప్‌గా నిలిచింది. మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. యువత క్రీడల ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించుకోవాలని వారు సూచించారు.
యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన మాణిక్ యాదవ్ ను స్థానిక నాయకులు, క్రీడాభిమానులు అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింతగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యను పాల్గొన్నారు.




