8 July, 2026 | 9:05 AM

మా మధ్య విబేధాలు లేవు

15-05-2024 12:30 AM

న్యూఢిల్లీ: లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, జట్టు యాజమాని సంజీవ్ గొయెంకాల మధ్య వివాదం వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి అనంతరం రాహుల్‌ను పిలిచి గొయెంకా చివాట్లు పెట్టడం కెమెరాలకు చిక్కింది. దీంతో గొయెంకాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో గొయెంకా మంగళవారం కేఎల్ రాహుల్‌కు తన స్వగృహంలో పార్టీ ఇచ్చాడు.

పార్టీకి హాజరైన రాహుల్‌కు ఆత్మీయ ఆలింగనం ఇస్తూ ఇంట్లోకి ఆహ్వానించాడు. దీనికి సంబంధించిన ఫోటోను ఎక్స్ వేదికగా పంచుకోవడంతో వీరిద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టమైంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలవ్వడంతో లక్నో సూపర్ జెయింట్స్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే లీగ్ నుంచి నిష్క్రమించింది.