8 July, 2026 | 10:03 AM

నో రిజర్వ్ డే

15-05-2024 12:25 AM

టీ20 ప్రపంచకప్

సెమీఫైనల్‌కు 250 నిమిషాలు

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తన సెమీఫైనల్ మ్యాచ్‌ను గయానా వేదికగా ఆడే అవకాశముంది.  గ్రూప్ ఏలో ఉన్న భారత్.. పాకిస్థాన్, కెన డా, ఐర్లాండ్, అమెరికాలతో మ్యాచ్ లు ఆడనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే భారత్ రెండో సెమీఫైనల్లో ఆడే చాన్స్ ఉంది. ఈ మెగాటోర్నీకి అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. జూన్ 1న ప్రారంభం కానున్న మెగాటోర్నీ జూన్ 29 వరకు జరగనుంది. అయితే టోర్నీలో ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డేను కేటాయించినట్లు ఐసీసీ పేర్కొంది. తాజాగా సెమీఫైనల్స్‌కు రిజర్వ్ డేకు బదులు 250 నిమిషాల సమయాన్ని కేటాయించినట్లు స్పష్టం చేసింది. మ్యాచ్ సమయానికి వాతావరణం అనుకూలించకపోతే రిజర్వ్ డే లేనందున అదనపు సమయంతో మ్యాచ్‌ను నిర్వహించే అవకాశమున్నట్లు పేర్కొంది.