9 July, 2026 | 4:11 PM

వామ్మో ... రోడ్డుపై చెట్టు ప్రమాదం పొంచి ఉన్నది!

09-07-2026 03:07 PM

వర్షాకాలం ఈదురు గాలులు, వర్షంతో పొంచి ఉన్న ప్రమాదం.

సంవత్సరాలు గడుస్తున్న.. పట్టించుకోని అధికారులు.

తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలో సంవత్సరాలు గడుస్తున్న అధికారులు వస్తూపోతున్న.. కొత్త ప్రజా ప్రతినిధులు ఏర్పడినప్పటికీ, కాలం అయిపోయి పోతున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా మారింది. మండల కేంద్రంలో ఊరి చివర గల.. హెచ్ పి, పెట్రోల్ బంకు సమీపంలో, కొన్ని సంవత్సరాలుగా పెద్ద వృక్షము ఒరిగి ఉన్నప్పటికీ సంబంధిత ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకపోవడంతో, ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందో, ఎవరి ప్రాణాలు పోతాయి అని రీతులో, చెట్టు సమస్య నెలకొన్నది. ప్రమాదం జరగకముందే జిల్లా ఉన్నతాధికారులు, పరిశీలించి తగు చర్యలు చేయాలని, వాకర్స్ కోరుతున్నారు.