4 September, 2026 | 5:12 AM

హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో ప్లాట్ల ఈ-వేలం

04-09-2026 | 03:40am

20 ప్లాట్లకు 6.57 కోట్ల ఆదాయం

షాద్‌నగర్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): కొత్తూరు మండలం ఇనుముల నర్వ వద్ద లేఔట్‌లోని ప్లాట్లకు హెచ్‌ఎండీఏ నిర్వహించిన వేలంలో కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. గురువారం హెచ్‌ఎండిఏ లేఔట్‌లో మొత్తం 60 ప్లాట్లకు ఈ-వేలం నిర్వహించగా 20 ప్లాట్లు అమ్ముడుపోయాయి. సుమారు రూ. 6.57 కోట్ల ఆదాయం సమకూరింది. వేలంలో గరిష్ఠంగా చదరపు గజానికి రూ. 21 వేల ధర పలికింది. అలాగే గజానికి సగటు ధర రూ. 16,725గా నమోదైంది.