4 September, 2026 | 4:40 AM

సురేఖది స్వయంకృతాపరాధమమే: విప్ ఆది

04-09-2026 | 03:35am

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) : మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం కొండా సురేఖ స్వయంకృతాపరాధమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Government Whip Adi Srinivas) పేర్కొన్నారు. సురేఖకు పార్టీ, ప్రభుత్వం అనేక అవకాశాలు ఇచ్చిందని, కుటుంబ సభ్యులను అదుపులో పెట్టుకోలేకపోయారని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పదే పదే విమర్శిస్తూ.. ప్రభుత్వాన్ని, పార్టీని బలహీనపర్చే ప్రయత్నం చేశారని తెలిపారు. కొండా సురేఖ వ్యవహార శైలిపై సోనియా, రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ సమగ్రంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖపై ఎందుకు కోపం ఉంటుందన్నారు.