calender_icon.png 28 January, 2026 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాసమస్యలపై చర్చించే అవకాశం ఇస్తలేరు

25-07-2024 01:51:46 AM

ఎమ్మెల్యే హరీశ్‌బాబు 

ప్రజాసమస్యలపై  అసెంబ్లీలో చర్చిం చేందుకు అధికార కాంగ్రెస్  ప్రభుత్వం అవ కాశం ఇవ్వడం లేదని బీజెపీ ఎమ్మెల్యే హరీష్ బాబు ఆరో పించారు. బుధవారం ఆయన మీడి యా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఒక్క రోజు కేంద్రం రాష్ట్రానికి తన సహకా రాన్ని నిలిపివేస్తే ప్రభు త్వాన్ని నడిపే దమ్ముందా అని ప్రశ్నించారు. బడ్జెట్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టడం బాధా కర మని, అసెంబ్లీలో కేంద్రంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు అబద్దాలు చెప్పారన్నారు. ఈ నెల 27న ప్రధాని అధ్యక్ష తన జరగనున్న నీతి అయోగ్ సమావేశాన్ని బహి ష్కరిస్తామని అనడం సరికాదని హితవు పలికారు.