1 March, 2026 | 1:53 AM

మార్పుకు ఇదే మంచి అవకాశం!

01-03-2026 12:00 AM

బీఎస్ రాములు :

* తెలంగాణలో త్వరలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు అగ్రనేతలు, కార్యకర్తలు చిరకాలంగా దూరమైన తమ అభిమానులను కలిసి మద్దతు సమీకరించి పోటీ చేయవచ్చు. 

దేశంలో రాజకీయం పరంగా మావోయిస్టులకు మంచి అవకాశాలున్నాయని చెప్పొచ్చు. ఫ్రెంచి సోషలిస్టు నమూనా ఇందుకు ఎంతో ఉపయోగపడనుంది. దేశ వ్యాప్తంగా ఆయా సామాజిక వర్గాలు, కులాలు రాజకీయాల్లో, అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రాతినిధ్యం కోరుతున్నారు. అంబేద్కర్ మరణానంతరం భార త్‌లో ఫ్రెంచి సోషలిస్టులు బహుజన వర్గాలకు పెద్ద దిక్కయ్యారు. బీసీ రిజర్వేషన్ల సాధ నలో, బీసీలు అధికారంలోకి రావడంలో వీరిదే ప్రధాన పాత్ర.

సోషలిస్టు క్యాంపుకు చెందిన రామ్ మనోహర్ లోహియా పాత్ర ఎనలేనిది. లోహియా నిరంతర కృషి వల్ల 1967 నుంచి యూపీ, బీహార్‌లలో కాంగ్రెస్‌ను ఓడించి సోషలిస్టులు అధికారంలోకి వస్తున్నారు. లోహియా బహుజన వర్గాలకు పార్టీలో ఎన్నికల్లో 60 శాతం సీట్లు ప్రాతినిధ్యం తప్పనిసరి చేశారు. ఆ కోవలో ఎది గిన వారి లిస్టు పేరున్న కాంగ్రెస్ నాయకుల కన్నా పెద్దది. 1960ల నుంచి ఇందిరను, ఇం దిరా కాంగ్రెస్‌ను కామరాజ్ నాడార్  నిలబెడితే సోషలిస్టు రాజకీయాలను లోహియా నిలబెట్టారు.

రాం నరేశ్ యాదవ్, బి పి మండల్,  ములాయం సింగ్ యాదవ్, లా లూ ప్రసాద్ యాదవ్, జార్జి ఫెర్నాండేజ్, మధు దండావతే, మధు లిమయే, శరద్ యాదవ్, రాం విలాస్ పాశ్వాన్, నితిష్ కు మార్, బిజూ పట్నాయక్, రామకృష్ణ హెగ్డే, రాజ్ నారాయణ్ తదితరులు సోషలిస్టు శిబిరం నుంచి వచ్చిన వారే. ఆంధ్ర ప్రదేశ్ నుంచి కూడా ఎందరో సోషలిస్టులు నాయకులుగా ఎదిగారు. 1955లో తెలంగాణను ఆంధ్రతో కలుపకూడదని స్థానిక సంస్థల తీర్మానాలను పార్లమెంటుకు సమర్పించిన ఎంపీ మాధవ రెడ్డి సోషలిస్టు పార్టీ తరఫున ఎన్నికైన వారే.

వీరంతా బహుళ పార్టీ వ్యవస్థలో సోషలిజం, బహుజన వర్గాలకు రాజకీ యాల్లో పెద్ద పీట అనే ఎజెండాతో భారతీయ రాజకీయాల్లో గొప్ప చారిత్రక పాత్ర నిర్వహించారు. ఇతర పార్టీ ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చినపుడు మంత్రి వర్గాల్లో చేరడాన్ని కూడా వ్యతిరేకించారు. లోహియా సహచరుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ దశాబ్దాల పాటు పార్లమెంటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

లోహి యా మరణించాక జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ రాజకీయాలతో 1970ల్లో అవినీతికి వ్యతిరేకంగా ఉత్తరాదిలో ఉద్యమానికి నా యకత్వం వహించారు. ఎమర్జెన్సీ తరువాత 1977లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో విపక్షాలను ఒక్క తాటిపైకి తెచ్చి జనతాపార్టీ అధికారంలోకి రావడంలో కింగ్ మేకర్‌గా జయప్రకాశ్ నారాయణ్ తన పాత్రను సమర్థంగా పోషించారు. 

అచ్చిరాని తిరుగుబాట్లు! 

భారత దేశంలో సాయుధ తిరుగు బా ట్లు, సాయుధ పోరాటాలు అచ్చి రాలేదు. 1857 మొదటి స్వాతంత్ర పోరాటం విఫలమైంది. గిరిజనులు చేసిన 169 తిరుగు బా ట్లు , సాయుధ పోరాటాలు కూడా విఫలమయ్యాయి. గదర్ పార్టీ తిరుగుబాట్లు, సుభా ష్ చంద్ర బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్, ఖాసిం రజ్వీ రజాకార్, తెలంగాణ సాయుధ పోరా టం, తెబాగ, పూనా, కేరళ మోప్లా తిరుగు బాట్లు, ఈశాన్య రాష్ట్రాల తిరుగు బాట్లు, జూ నాగడ్, కాశ్మీర్, నిజాం తిరుగు బాట్లు, కొ మురం భీం రాంజీ గోండ్, బిర్సా ముండా తిరుగుబాట్లు కూడా విఫలమయ్యాయి. 

స్వాతంత్రానంతరం జరిగిన తిరుగు బాట్లతో పాటు నక్సల్ బరి, శ్రీకాకుళ  పోరాటాలు కూడా విఫలమైన దాఖలాలే ఎక్కువ. ఈ పోరాటాలు విఫలం కావడానికి కార్ల్ మా ర్సూ అన్నట్లుగా ఆధునిక వ్యవస్థ, ఆధునిక యంత్రాంగాలు, ఆధునిక ఆయుధ సంపత్తి, ఆధునిక సైన్సు వంటివి ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి. అయితే కొన్ని దేశాల్లో వెనకబడిన సమాజాలు ఆధునిక సమాజాలను ఓడించి విజయం సాధించాయి. మన దేశం లో కూడా దీనికి కొన్ని ఉదాహరణలున్నాయి. వెనకబడిన సమాజాలు సంఘ టితంగా యుద్దం చేసినప్పుడు గెలిచారు.

కాని కులవ్యవస్థలో ఎవరి వృత్తులు వారు చేయడం వల్ల భారత్‌లో కొన్ని వర్గాల కులా లే యుద్దంలో పాల్గొనడం జరిగింది. విదేశీ దాడుల్లో ఓడి పోవడానికి ప్రధాన కారణం వర్ణ, కుల వ్యవస్థను విభజించి పాలించిన విధానమే అని చెప్పొచ్చు. అశోకుడి బలమైన సైనిక శక్తి మీద కళింగులు ఓడిపో యారు. లక్షల మంది మరణించారు.

అలాగే ముస్లిం నాయకుల దండయాత్రలతో మన దేశ రాజులు ఓడిపోతూనే వచ్చారు. ఆ యుధ సంపత్తిలో, సైనిక సంపత్తిలో ఎలా ఉన్నా కుల విభజనే అన్ని అపజయాలకు మూలంగా నిలిచింది. ప్యారిస్ కమ్యూన్ గు ణ పాఠాలకు సూచించిన కార్యక్రమాలు సరైనవా కావా అన్నది పక్కనబెడితే  వయోజన ఓటు హక్కు, మహిళలకు ఓటు హక్కు వ చ్చాక మొత్తం మారి పోయింది. 

ప్రజల మధ్యకు..

తెలంగాణలో త్వరలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు అగ్రనేతలు, కార్యకర్తలు చిరకాలంగా దూరమైన తమ అభిమా నులను కలిసి మద్దతు సమీకరించి పోటీ చేయవచ్చు. ఇతరులను గెలిపించవచ్చు. ఇది అందరిని కలవడానికి, ప్రజల నాడి తెలుసుకోవడానికి మావోయిస్టులకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. 1989లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్టీఆర్ టీడీపీని ఓడించి కాంగ్రెస్‌కు చెందిన మర్రి చెన్నారెడ్డి గెలవడంలో పీపుల్స్ వార్ పాత్ర అందరికి తెలిసిం దే.

అందుకే ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఎంతో ఉదారంగా ఉండేవారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆంధ్రా నాయకత్వం దోపిడీ కోసం పీపుల్స్‌వార్‌పై నిషేదాలు విధించా రు. అయితే మర్రి చెన్నారెడ్డి  ఉన్నంత కాలం పీపుల్స్ వార్ లక్షలాది మందిని కదిలించిం ది. వేలాది సభలు నిర్వహించింది. 2004 ఎన్నికల్లో  కాంగ్రెస్ గెలవడంలో పీపుల్స్ వార్ అభిమానులదే కీలకపాత్ర. 1989 నుం చి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు మళ్లీ మొదలయ్యాయి.

1996 నుంచి 2014 దాకా సాగిన మలి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విప్లవ అభిమానులే కీలక పాత్ర పోషించారు. ప్రొఫెసర్ జయశంకర్, గద్దర్, అల్లం నారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్య, విమలక్క, పాశం యాదగిరి, నందిని సిధారెడ్డి, జూలూరు గౌరీ శంకర్, గాదె ఇన్నయ్య, వి.ప్రకాశ్, నంది నిర్మలా రెడ్డి మొదలుకొని వేల మంది విప్ల వ భావజాలం నుంచి వచ్చినవారే. 

సోషలిజం బాటలో..

-అయితే --ఈసారి జనంలోకి వచ్చిన మావోయిస్టులు రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం కొత్త విషయం కాదు. వీలైతే కమ్యూనిస్టు, సోషలిస్టు పాతతరం నాయకుల అనుభవాలను ఆసరాగా తీసుకునే ప్రయత్నాలు చేయాలి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది గనుక స్థానిక ఎన్నికల్లో రాజకీయంగా మావోయిస్టులు నిలదొక్కుకునేందుకు ప్రజలు మొగ్గు చూపే అవకాశముంది. అదే సమయంలో బీసీలు, ఎస్సీలు నూతన శ్రేణులు తమ ప్రాతినిధ్యం కోసం ముందుకు కదులుతున్నారు.

ఈ శక్తులన్నింటిని ఉపయోగించు కుంటే ఒక స్పష్టత వస్తుంది. లోహియా సోషలిజం బాటలో బహుజన వర్గాలకు, మహిళలకు పెద్దపీట వేసి గెలిపిస్తే అదొక కీలక మలుపు అయ్యే అవకాశముంది. ---నలభై ఏళ్ల క్రితం తాము పార్టీకి చేసిన సూచ నలు, నూతన ప్రజా స్వామిక విప్లవాన్ని (ఎన్‌డీఆర్) ను జిల్లా అభివృద్ధికి అన్వయించి ఐదేళల్లో ఇతర పార్టీలకన్నా ఎంత సమగ్రాభివృద్ది చేయగలమనేది ఆలోచించాలి. ఆ విధంగానే ప్రచారం చేయడంతో పాటు ఎన్నికల ప్రణాళిక రూపొందించుకోవాలి.

ఇది అన్ని పార్టీలకు మార్గదర్శనం చేస్తుంది. జిల్లా కలెక్టర్, జిల్లా లీడ్ బ్యాంకు కలిసి రూపొందించే అభివృద్ధి ప్రణాళికలు, పరిశ్రమలు, వ్యవసాయం, ఇతర వృత్తులు, ఉపా ధి కల్పన, సంక్షేమ పథకాలను మించి మన ప్రణాళిక రూపకల్పన జరగాలి. ఇప్పటికైనా జిల్లాల వారీగా, నియోజక వర్గాల వారీగా ఈ అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందించడం అవసరం.

అవి అందరికి ఉపయో గపడతాయి. ఎన్నికల్లో సుమారు వందకు పైగా వర్గాలను, కులాలను, సంఘాలను, వృత్తులను, ఉద్యోగులను, వ్యాపార వర్గాలను కలుపుకొని ముందుకు సాగాల్సి ఉం టుంది. సిద్ధాంత ఆధిపత్య భాషను మార్చుకొని ఓట్లు అడగడం ద్వారా ఫలితాలు సాధించవచ్చు.

 వ్యాసకర్త సెల్: 8331966987