1 March, 2026 | 3:37 AM

తమిళనాడులో పీఠమెవరిది?

01-03-2026 12:00 AM

డాక్టర్ తిరుణహరి శేషు :

* ప్రస్తుతం తమిళ రాజకీయాలు విజయ్ టీవీకే పార్టీ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో విజయ్ కింగ్ అవుతాడా లేక కింగ్ మేకర్‌గా నిలుస్తాడా అన్నది చర్చనీయాంశమైంది. 

దక్షిణ భారతంలో తమిళనాడు, కేరళం, పాండిచ్చేరి రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడులో డీఎంకే, కేరళంలో లెఫ్ట్ పార్టీలు, పాండిచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలోని ఎన్. ఆర్ కాంగ్రెస్‌లు మరొకసారి గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని చూస్తుంటే; తమిళ నాడు, కేరళంలో గెలిచి దక్షిణాదిపై పట్టు సాధించాలని బీజేపీ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

234 శాసనసభ స్థానా లు గల తమిళనాడు అసెంబ్లీ లో 118 శాసనసభ స్థానాలను గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 1967 నుంచి తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ పార్టీల మధ్యనే కీలక పోటీ నెలకొన్నప్పటికీ  ఈసారి మూడో పక్షంగా విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ రాష్ట్ర రాజకీయా ల్లో అడుగుపెట్టడంతో ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాడు రాజకీయ ముఖచిత్రమే మారబోతుందనేది చర్చనీయాం శంగా మారింది.

డీఎంకే గట్టెక్కేనా!

1967లో అన్నాదురై నేతృత్వంలో మొదటిసారి తమిళనాడులో అధికార పగ్గాలు చేప ట్టిన ద్రవిడ మున్నేట్ర కజగం 13 పర్యాయా లు రాష్ట్ర శాసనసభకి జరిగిన ఎన్నికల్లో  ఆ రు పర్యాయాలు జయకేతనం ఎగరవేసి త మిళ రాజకీయాల్లో బలమైన రాజకీయ శక్తి గా డీఎంకే ఎదిగింది. వరుసగా రెండు శాసనసభ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా, కరుణా నిధి మరణించినా.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నాటి అధికార అన్నాడీఎంకేను ఓడించి ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు.

స్టాలిన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన 2024 లోక్ సభ ఎన్ని కల్లో ఇండియా కూటమి తరపున 39 లోక్ సభ స్థానాలలో (100 శాతం స్ట్రైక్ రేట్) విజ యం సాధించిన డీఎంకే తన పట్టు నిలుపుకుంది. స్టాలిన్ పాలనపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నా, అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని స్టాలిన్ విశ్వసిస్తున్నారు.

మహిళ లకు ప్రతినెలా వెయ్యి రూపాయలు, విద్యార్థులకు నెలకు రూ. వెయ్యి, స్త్రీలకు ఉచిత బ స్సు ప్రయాణం, పేదల ఇంటి వద్దకే వైద్యం, ఉద్యోగులకు పెన్షన్ హామీ, రైతులకు ప్రత్యేక బడ్జెట్, విద్యార్థులకు అల్పాహారం, ఉలగం ఉంగల్ కైయిల్ పథకం ద్వారా యువతకి లాప్‌టాప్‌ల పంపిణీ లాంటి సంక్షేమ పథకాలు ఓట్ల వర్షం కురిపిస్తాయని డీఎంకే ఆ శాభావం వ్యక్తం చేస్తున్నది. ఎన్నికలకు ముం దు స్టాలిన్ రాజకీయ ఎత్తుగడలు కూడా డీఎంకేకు కలిసి రానున్నాయి.

విజయ్ పార్టీ టీవికే రూపంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక రావటం, డీఎంకే నేతృత్వంలోని ఇండి యా కూటమిలోకి విజయ్ కాంత్ పార్టీ డీ ఎండీకే చేరడం, మాజీ సీఎం పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరడం,  కమలహాసన్, శరత్ కు మార్ లాంటి సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లు ఇప్పటికే స్టాలిన్‌కు మద్దతు తెలపడం తో గతంలో కంటే డీఎంకే కూటమి బలంగా కనిపిస్తుంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఓ ట్లు, సీట్లు తగ్గినా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీజేపీకి కలిసొచ్చేనా!

తమిళనాడులో పాగా వేయటానికి బీజేపీ బలంగా ప్రయత్నిస్తున్నది. 2021 ఎన్నికలలో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కేవలం నాలుగు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలవగలిగింది. కానీ 2021 నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి తమిళనాడులో తన ఓటు బ్యాంకుని 2.6 శాతం నుంచి 11.2 శాతానికి పెంచుకోవడంలో సఫలమైంది. ద్రవిడ పార్టీల సహకారం లేకుం డా తమిళనాడులో ఎదిగే అవకాశం లేదని గ్రహించిన బీజేపీ మరోసారి అన్నాడీఎంకేతో జట్టు కట్టక తప్పలేదు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకేలు విడివిడిగా పోటీ చేయటం వల్ల రెండు పార్టీలు నష్టపోవటమే గాక ఏ ఒక్క లోక్ సభ స్థానంలో కూ డా రెండు పార్టీలు విజయం సాధించలేక ఘోర పరాభవం మూటగట్టుకున్నాయి. అయితే 2024 లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే తో కలిపి ఎన్డీఏ కూటమి సాధించిన 41 శాతం ఓట్లను నిలబెట్టుకోగలిగితే, సేలం, కోయంబత్తూర్, మదురై లాంటి ప్రాంతాల్లో తన బలాన్ని నిలుపుకోగలిగితే డీఎంకేకి గట్టి ప్రత్యర్థిగా నిలబడే అవకాశం లేకపోలేదు.

బీజేపీ, కాంగ్రెస్‌లు జాతీయ పార్టీలుగా ఉన్నప్పటికీ తమిళనాడులో మాత్రం ఏదో ఒక కూటమిలో తోక పార్టీలుగానే మనుగడ సాగిస్తున్నాయి. ఎన్డీయే కూటమిలో పీఎంకే లాంటి పార్టీలు చేరినా అన్నాడీఎంకే బలంపైనే కూటమి గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.

విజిల్ మోగుతుందా!

ప్రస్తుతం తమిళ రాజకీయాలు విజయ్ టీవీకే పార్టీ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో విజయ్ కింగ్ అవుతాడా లేక కింగ్ మేకర్‌గా నిలుస్తాడా అన్నది చర్చనీయాంశమైంది. సినీ పరిశ్రమకే చెందిన ఎం జీ రామచంద్రన్, జయలలిత, కరుణానిధిలాగే విజయ్ కూడా తమిళనాడు రాజకీ యాలను ప్రభావితం చేయగలుగుతాడా అ నే ప్రశ్నలకు ఎన్నికలలో ఆ పార్టీ సాధించే విజయమే సమాధానంగా కనిపించనుంది.

ఏడాదిన్నరగా విజయ్ నిర్వహిస్తున్న సభలకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నా,  అభి మానాన్ని ఓట్లుగా మార్చుకునే రాజకీయ వ్యూహాలు విజయ్ దగ్గర ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉన్న అన్నాడీఎంకేను, పట్టణాలలో బలమైన బలగమున్న డీఎంకేను విజయ్ ఎంతమేర నిలు వరించగలడనేది చూడాలి. డీఎంకేని రాజకీయ శత్రువుగా, బీజేపీని సైద్ధాంతిక శత్రు వుగా ప్రకటించి విమర్శలు చేస్తున్న విజయ్ ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ డీఎంకే, టీవీకే మధ్య ఉండేలాగా ఎత్తుగడలు వేస్తన్నట్లుగా అనిపిస్తోంది.

రంగుల ప్రపంచం నుంచి వచ్చిన విజయ్ వ్యక్తిగత జీవితం కూడా రాజకీయంగా మారిపోయింది. విజయ్‌కు, నటి త్రిషకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు సద్దుమనగక ముందే విజయ్ భార్య సంగీత.. వివాహేతర  సంబంధాలు ఉన్న కారణంగా విజయ్ నుంచి విడాకులు కావాలని కోర్టులో కేసు వేసింది.ఎన్నికలకు ముం దు ఈ పరిణామాలు విజయ్‌ను ఆత్మరక్షణలో పడేశాయని చెప్పొచ్చు.

విజయ్ టీవీకే పార్టీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలికలు, చిన్నమ్మ శశికళ పెట్టే పార్టీ వల్ల అన్నా డీఎంకేకు నష్టంతో అంతిమంగా డీఎంకేకు లాభం చేకూర్చే అవకాశం లేకపోలేదు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో యువత, మ హిళల ఓట్లే నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నాయి. సర్ ద్వారా తొలగించిన 97.37 లక్షల ఓట్లు కూడా ఆయా పార్టీల జయాపజాయాలను ప్రభావితం చేయనున్నాయి. తమిళనాడు సీఎం పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారనేది ఓటరు తీర్పుపైనే ఆధార పడి ఉంటుంది.

 వ్యాసకర్త సెల్: 9885465877