19 April, 2026 | 5:39 AM

ఇది సూపర్ ఫుడ్

25-05-2025 12:00 AM

మొలకెత్తిన పెసలు, శనగలు వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. అయితే మొలకెత్తిన ఉల్లిపాయ కూడా సూపర్ ఫుడ్‌గా పనిచేస్తుందని మీకు తెలుసా? అవును మొలకెత్తిన ఉల్లిపాయ రుచికి కొంచెం కారంగా ఉండవచ్చు.

కానీ దీన్ని తినడం వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. అవి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆహారంలో మొలకెత్తిన ఉల్లిపాయలను చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. 

ఉల్లిపాయ మొలకెత్తినప్పుడు.. దాని పోషకాలు అనేక రెట్లు పెరుగుతాయి. దాంట్లో విటమిన్ సి, విటమిన్ బి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ మన శరీరాన్ని లోపలి నుంచి బలోపేతం చేయడం సహాయపడతాయి. 

మొలకెత్తిన ఉల్లిపాయలలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపును శుభ్రపరుస్తుంది. 

విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. ఉల్లి మొలకలను తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్‌లు, ఇతర వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.  

కొన్ని అధ్యయనాల ప్రకారం మొలకెత్తిన ఉల్లిపాయలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి.