25-05-2025 12:00:00 AM
ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అనే సంగతి అందరికీ తెలిసిందే. దీనివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం లాంటి జబ్బులు వస్తాయి. స్మోకింగ్ ప్రమాదాల గురించి సిగరెట్ పాకెట్ల మీద.. సినిమా థియేటర్లలో.. టీవీల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులపై పరిశ్రమల వ్యూహాలను అర్థం, అవగాహన కల్పించడం ఈ ఏడాది ఉద్దేశం.
పొగాకు నములుతున్నారా?
పళ్ల అసహ్యకరమైన రీతిలో పచ్చగా మారతాయి. పళ్ల మీద మరకలు, మచ్చలు ఏర్పడతాయి. నోటి నుంచి దుర్వాసన వస్తుంది.
నోటికి రుచులు, ముక్కుకు వాసనలు తెలియవు. నోటిలో ఊరే లాలాజం తగ్గుతుంది. దాంతో పళ్లు దెబ్బతింటాయి. చిగుర్ల సమస్యలూ వస్తాయి.
పిప్పిపళ్లు, చిగుర్ల సమస్యలు వస్తాయి. పంటి మీది ఎనామిల్ దెబ్బతింటుంది. చిగుర్ల లైన్ కిందికి వెళ్తుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దాంతో వాటంతట అవే తగ్గిపోయే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ప్రమాకరంగా మారతాయి.
పొగాకు నమలడం వల్ల నోట్లోకి వెలువడే హానికరమైన విషద్రవాల ప్రభావం వల్ల చిగుర్లపైన, పెదవులపైన, గొంతులోన దుష్ప్రభావం చూపుతుంది. నోటిలోపలి మృదుకణజాలంపై పుండ్లు ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల నోరు, గొంతు, ఊపిరితిత్తులకు గాలిని అందించే మార్గంలోనూ ఆహారనాళం క్యాన్సర్లు రావచ్చు.
పొగాకు వల్ల గుండెకు నేరుగా హాని జరుగుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కణంలోని జన్యు పదార్థాలు డీఎన్‌ఏకు హాని జరుగుతుంది.
పొగాకు ఏ రూపంలో వాడినా అది పూర్తిగా ప్రమాదకరం. అది అనేక నోటి సమస్యలకు, నోటి దుర్వాసనకు, చిగుర్ల వ్యాధులకు కారణం. అంతేకాదు ప్రాణాంతకమైన ఎన్నెన్నో క్యాన్సర్లకు దారితీసే ప్రమాదం ఉన్నది. నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్, జీర్ణవ్యవస్థలో వచ్చే ఎన్నో రకాల క్యాన్సర్లతో పాటు, ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ముఖ్యంగా పొగాకు వినియోగమే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.
ఇది ఒక వ్యసనం
ధూమపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ.. ఆ వ్యసనాన్ని వదలించుకోవాలనుకున్నా ఆ పని చేయలేకపోతున్నవారే ఎక్కువ. ఇందుకు కారణం.. పొగాకు ఉత్పత్తులోని నికోటిన్‌కు అలవాటు పడటమే. దీంతో పొగాకు ఉత్పత్తుల ద్వారా కాకుండా వేరే రూపాల్లో నికోటిన్ అందించి వ్యసనాన్ని మాన్పించడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు.
దీన్ని నికొటిన్ స్థానభ్రంశ చికిత్స అంటారు. మొక్కల నుంచి తీసిన సైటిసైన్ అనే పదార్థాన్ని మాత్రల రూపంలో తీసుకుంటే ఈ చికిత్స ఇంకా ఎక్కువ సమర్థంగా పనిచేస్తుందని ప్రయోగాల్లో తేలింది. అర్జెంటీనాకు చెందిన పరిశోధకులు 6,000 మంది ధూమపాన ప్రియులపై ఎనిమిది ప్రయోగాలు చేసి ఈ అంశాన్ని నిర్ధారించారు.
లక్షణాలు
నోట్లో చాలాకాలం వరకు తగ్గని పుండ్లు (అల్సర్స్)
నోటిలో ఎక్కడైనా కండ పెరగడం
తెల్లని మచ్చ కనిపించడం
నమలడంలో ఇబ్బంది
నోటి, నాలుగ, దవడ కదలికలు మందగించడం
చాలాకాలం పాటు గొంతు బొంగురుగా ఉండటం
గొంతులో ఏదో అడ్డుగా ఉన్నట్లు అనిపించడం.
పై లక్షణాలు కనిపించినప్పుడు వెంటటే డాక్టర్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి. ధూమపానంతో..
ధూమపానం ఊపిరి పీల్చుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. జీవిత నాణ్యతను తగ్గిస్తుంది.
చర్మం వేగంగా వృద్ధాప్యం, ముడతలు, మచ్చలకు దారితీస్తుంది.
మధుమేహం, బోలు ఎముకల వ్యాధి, రుమాటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఉంటాయి.
కంటి శుక్లం, మచ్చలు, డ్రై ఐ సిండ్రోమ్ వంటి సమస్యలు రావచ్చు.
చిగుళ్ల వ్యాధి, దంత క్షయం, నోటి దుర్వాసన, దంతాల నష్టం, నోటి క్యాన్సర్ వంటి అనారోగ్యాలు వస్తాయి. పొగాకు నములుతున్నారా?
పళ్ల అసహ్యకరమైన రీతిలో పచ్చగా మారతాయి. పళ్ల మీద మరకలు, మచ్చలు ఏర్పడతాయి. నోటి నుంచి దుర్వాసన వస్తుంది.
నోటికి రుచులు, ముక్కుకు వాసనలు తెలియవు. నోటిలో ఊరే లాలాజం తగ్గుతుంది. దాంతో పళ్లు దెబ్బతింటాయి. చిగుర్ల సమస్యలూ వస్తాయి.
25 రకాలకు పైగా క్యాన్సర్లు
పొగాకు ఉత్పత్తి, వినియోగంలో చైనాదే అగ్రస్థానం. అక్కడ సుమారు 30 కోట్ల మంది పొగాకు ఉత్పత్తులు వాడుతున్నారని అంచనా. ఆ తర్వాత 27 శాతం వినియోగదారులతో భారత్ రెండో స్థానంలో నిలుస్తున్నది. ప్రపంచంలో ప్రతి వంద అర్ధాంతర మరణాల్లో పదింటికి పొగాకు వాడకమే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తేల్చింది.
భారత్‌లో వివిధ కారణాలతో ఏటా పది లక్షలమంది అర్ధాంతరంగా మరణిస్తున్నారు. వీరిలో 3.5 లక్షల మంది పొగాకు బాధితులే. పొగాకు వినియోగంవల్ల సుమారు 25 రకాలకు పైగా క్యాన్సర్లు ప్రాణాల్ని హరిస్తుంది.
డాక్టర్ రవిచందర్ వెలిగేటి, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్
పొగతాగడం ఇప్పుడే మానండి!
స్మోకింగ్ చేయడం వల్ల చాలారకాల వ్యాధులు చుట్టూ ముడతాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్, దీర్ఘకాలిక బ్రాంకైటిస్, ఎం పై సీమా వంటి వ్యాధులకు కారణమవుతుంది. ఊపిరితిత్తులను మృదుకణజాలాన్ని నాశనం చేసి శ్వాస తీసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తపోటును పెంచి రక్తనాళాలను దెబ్బతీస్తుంది.
నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లకు సులభంగా గురవుతారు. పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఇది చిన్న పిల్లల్లో నిమోనియా వచ్చే అవకాశాలు 40 శాతం పెరుగుతుంది. అలర్జీ ఆస్తమా ఉన్నవారు ఈ పొగకు గురికావడం వల్ల ఏ మందులు పనిచేయవు. వారిలో ఇమ్యూనిటీ తగ్గి తరచుగా ఇన్ఫెక్షన్లకు గురి అవుతారు. ఇదే నిమోనియాకు దారితీస్తుంది.
డాక్టర్ విష్ణున్ రావు వీరపనేని, శ్వాస హాస్పిటల్ చైర్మన్, హైదరాబాద్
మానసిక స్థితిపై ప్రభావం..
సిగరెట్ తాగే అలవాటుతో అరవై ఏళ్లు, అంతకు పైబడిన వయసు కలవారిలో మానసిక సామర్థ్యాలు సన్నగిల్లుతుంది. ధూమపానం, మధుమేహం, హైపర్‌టెన్షన్ మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ కారకాలన్నీ ఏకమైనప్పుడు మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే కరోటిడ్ ధమనికి చెందిన అథ్లెస్లోరోటిక్ గట్టిపడటం వంటి బ్రెయిన్ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
తాజా పరిశోధనలో ధూమపానం, మధుమేహం, హైపర్‌టెన్షన్‌లు కలగలసినప్పుడు మానసిక సామర్థ్యాలు దిగజారుతాయని తేలింది. అధ్యయనం ప్రకారం 60 ఏళ్లు, అంతకు మించి వయసు కలిగిన 3,007 మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో ధూమపానం అలవాటును వదులుకొనేలా ప్రోత్సహించడం ద్వారా వ్యక్తుల్లో చక్కని ఆలోచనలు, నేర్చుకునే.. గుర్తు పెట్టుకోగల శక్తి వంటి సామర్థ్యాలను కాపాడవచ్చని పరిశోధకులు తేల్చారు.
హరీశ్ ఆజాద్, సైకాలజిస్ట్ (ఆర్‌సీఐ)