calender_icon.png 9 February, 2026 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు ఐఈడీల స్వాధీనం

09-02-2026 02:13:26 AM

ఛత్తీస్‌గఢ్ మురుల్నపలో గుర్తింపు

చర్ల, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ -నారాయణ్పూర్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మూడు శక్తివంతమైన ఐఈడిలను స్వాధీనం చేసుకున్నారు. పార్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురుల్నప గ్రామంలోని అటవీ, కొం డ ప్రాంతాలలో డిఆర్‌జి, బిఎస్‌ఎఫ్ సంయుక్త బృందం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ ఆపరేషన్ సమయంలో, భద్రతా దళాలు  మా వోయిస్ట్‌ల కుట్రను బయటపెట్టాయి. మావోయిస్ట్‌లు ఈ ప్రాంతంలో రెండు  ప్రెషర్ కుక్క ర్  ఐఈడిలు (ఒక్కొక్కటి సుమారు 5 కిలోల బరువు కలిగింది)  ఒక బీర్ బాటిల్ ఐఈడి లను అమర్చారు. వాటిని స్వాధీనం చేసుకున్న తర్వాత, బిడిఎస్ (బాంబు డిస్పోజల్ స్క్వాడ్) బృందం అత్యంత జాగ్రత్తగా నిర్వీర్యం చేశారు.