1 August, 2026 | 12:04 PM

భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ భవనం ప్రారంభం

01-08-2026 11:19 AM

భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ భవనం ప్రారంభించిన ప్రధాని మోదీ

భోగాపురం: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం(Alluri Sitarama Raju International Airport) ప్రారంభోత్సవం జరుగుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని(Bhogapuram Airport terminal building) ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ప్రారంభించారు. ప్రధాని మోదీ వెంట గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నారు. భోగాపురం విమానాశ్రయం అతిపెద్ద రన్ వే, అత్యాధునిక హంగులతో నిర్మించారు. ఎయిర్ పోర్టును ప్రారంభోత్సవం చూసేందుకు భారీగా జనం తరలి వచ్చారు. టెర్మినల్ భవనంలోని అత్యాధునిక వసతులను మోదీ పరిశీలించారు జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ విమానాశ్రయ టెర్మినల్ గురించి ప్రధానికి వివరించారు. చెక్-ఇన్ హాల్, వసతుల గురించి ప్రధానికి జీఎంఆర్ గ్రూప్ ప్రతినిధులు వివరించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను ప్రధాని పరిశీలించారు.