29 June, 2026 | 2:22 PM

థ్రిల్లింగ్ టన్నెల్

02-09-2025 12:00 AM

కోలీవుడ్ హీరో అథర్వా మురళీ ఖాకీ చొక్కా వేసుకున్నా.. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ను ఎంచుకున్నా బ్లాక్ బస్టర్ పక్కా. ఈ క్రమంలో అథర్వా మరోసారి తనకు కలిసి వచ్చిన యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ జానర్లో ‘టన్నెల్’ అనే మూవీని చేశారు. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించారు. అశ్విన్ కాకుమాను విలన్ పాత్రలో కనిపించనున్నా రు.

ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీని తెలుగులోకి ఎ.రాజు నాయక్ లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులో ఈ ట్రైలర్ సెన్సేషన్‌గా మారింది. జస్టిన్ ప్రభాకరన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. శక్తి శరవణన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. కలైవానన్ ఈ సినిమాకు ఎడిటర్. తెలుగు వెర్షన్ ప్రమోషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి.

అతి త్వరలోనే తెలుగు వర్షెన్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసి ఇక్కడా అంచనాలు పెంచనున్నారు. ఇక అథర్వా మురళీ సైతం తెలుగు ప్రమోషన్స్ లో సందడి చేయబోతోన్నారు.