6 May, 2026 | 10:38 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

బ్యూటీ.. లవ్ సాంగ్

02-09-2025 12:00 AM

అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన మూవీ ‘బ్యూటీ’. ఈ సినిమాకు జేఎస్‌ఎస్ వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేని ఆర్వీ సుబ్రహ్మణ్యం అందించారు. విజయపాల్ రెడ్డి అడిదల, ఉమేశ్ కుమార్ భన్సల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే గ్లింప్స్, మోషన్ పోస్టర్, పాటలు, టీజర్ రిలీజ్ అయ్యాయి.

తాజాగా ‘ప్రెట్టీ ప్రెట్టీ’ అంటూ ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేశారు. విజయ బుల్గానిన్ కూర్చిన బాణీకి సనారే లిరిక్స్ రాయగా, ఈ పాటను పీవీఎన్‌ఎస్ రోహిత్ ఆలపించారు. సెప్టెంబర్ 19న విడుదల కానున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా శ్రీ సాయికుమార్ దారా, ఆర్ట్ డైరెక్టర్‌గా బేబీ సురేశ్ భీమగాని, ఎడిటర్‌గా ఎస్బీ ఉద్ధవ్ పనిచేశారు.