భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 20 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. 72,174 మంది భక్తులు నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 35,192 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.88 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు శనివారం ప్రకటించారు.
తిరుమలలో నేటి సమాచారం..
శ్రీవారి మెట్లలో ఉన్న దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లు శ్రీవారి మెట్ల మార్గం నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ కు మార్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో 2025-26వ విద్యా సంవత్సరానికి పలు కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సంప్రదించాల్సిన నంబర్లు: 9440793205, 3848374408.






