24 August, 2026 | 11:45 AM

Breaking News

అమెరికాలో దమ్మాయీగూడ యువకుడి విషాదాంతం   •   కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •  

చరిత్రలో నేడు

29-06-2025 12:00 AM

జాతీయ కెమెరా దినోత్సవం

ప్రతి సంవత్సరం జూన్ 29న జాతీయ కెమెరా దినోత్సవాన్ని జరుపుకుంటారు ఫోటోగ్రఫీ ప్రియులు.  ఫోటోగ్రఫీ అనేది గ్రీకు పదం నుంచి వచ్చింది. ప్రస్తుతం ఫొటోగ్రఫీ అనేది మన దైనందిన జీవితంలో భాగమైంది. ఫొటోగ్రఫీ అంటే కాంతితో రాయడం అని అర్థం. జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవడానికి, మధురమైన క్షణాలను శాశ్వతంగా భద్రపరిచే సాధనం. 

బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా

జూన్ 29, 1756న కలకత్తాలో జరిగిన ఘోరమైన ఘటన ఇది. కలకత్తా బ్లాక్ హోల్ అనేది కలకత్తాలో ఫోర్ట్ విలియంలోని ఒక చిన్న చెరసాల గది. బెంగాల్ నవాబైన సిరాజ్ సైనికులు, అనేక మంది బ్రిటిషు యుద్ధ ఖైదీలను ఈ చిన్న గదిలో కుక్కారు. తెల్లవారేసరికి ఆ ఖైదీలలో చాలామంది మరణించారు.

ఆ బ్రిటిషు ఖైదీల్లో ఒకడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి అయిన జాన్ జెఫానియా హోల్వెల్.. ఆ గదిలో ఊపిరి ఆడకపోవడం, వేడి, అలసట కారణంగా అక్కడ ఉన్న 146 మంది యుద్ధ ఖైదీలలో 123 మంది మరణించారని హాల్వెల్ చెప్పాడు. 

జాతీయ గణాంకాల దినోత్సవం

జాతీయ గణాంకాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 29న జరుపుకుంటారు. 2007లో భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త, గణాంక నిపుణుడు ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ గౌరవార్థం మొదటిసారి జాతీయ గణాంకాల దినోత్సవాన్ని జరుపుకుంటాం.

గణాంకాల ద్వారా మన ఆర్థిక ప్రణాళిక, బడ్జెటింగ్‌లో నిర్ణయాలు తీసుకోగలమని ఈ దినాన్ని నిర్వహిస్తారు. ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మొట్టమొదట స్టాటిస్టికల్ లాబొరేటరీతో ప్రారంభించారు. ఇది తర్వాత 1931లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌గా మారింది. ఆయనను ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అని కూడా పిలుస్తారు. 

హిందూ వితంతువుల పునర్వివాహ చట్టం

జూన్ 29, 1856న జరిగిన ముఖ్యమైన ఘటన హిందూ వితంతువుల పునర్వివాహ చట్టం. ఇది 1856లో ఆమోదించబడింది. ఈ చట్టం ప్రకారం హిందూ వితంతువులకు పునర్వివాహం చేసుకోవడానికి చట్టబద్ధమైన హక్కు లభించింది.