24 June, 2026 | 2:28 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

నేడు వేపకాయల బతుకమ్మ

08-10-2024 12:00 AM

తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగలో భాగంగా ఏడో రోజు వేపకాయల బతుకమ్మను నిర్వహిస్తారు. నేటి వేపకాయల బతుకమ్మలో భాగంగా వేప చెట్టుని ఆదిపరాశక్తికి ప్రతిరూపంగా భావించి వేపకాయల బతుకమ్మను పూజిస్తున్నారు. వేపకాయల బతుకమ్మ పండుగ రోజు చామంతి, గునుగు, తంగేడు, గులాబీ పూలతో ఏడు దొంతరలుగా బతుకమ్మను పేరుస్తారు.

సకినాలు తయారు చేయడానికి ఉపయోగించే పిండితో చిన్న వేప పండ్లు ఆకారంలో చిన్న ముద్దలు చేసి బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. అంతేకాదు పప్పు బెల్లాన్ని కూడా నైవేద్యంగా ఏడో రోజు సమర్పిస్తారు. వేపకాయల బతుకమ్మలో భాగంగా ఉదయం బతుకమ్మలను పూజించినవారంతా, సాయంత్రం పూట బతుకమ్మని ఇంటి ముంగిట్లో పెట్టి అంతా కలిసి పాటలు పాడుతూ ఆడతారు.

ఇలా ఏడో రోజు ఏడు అంతరాల బతుకమ్మ గంగమ్మ చెంతకు చేరుతుంది. ఇంకా మిగిలిన రెండు రోజులు బతుకమ్మ ఆటలకు తెలంగాణ ఆడపడుచులు రెడీ అవుతారు. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతారు.