calender_icon.png 11 February, 2026 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే మున్సి‘పోలింగ్’

11-02-2026 02:45:40 AM

అన్ని ఏర్పాట్లు  పూర్తి చేశామన్న చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశం

చేవెళ్ల, ఫిబ్రవరి 10(విజయక్రాంతి): కొత్తగా ఏర్పడిన చేవెళ్ల మున్సిపల్ ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఎన్నికల అధికారులు18వార్డులకుగాను 37 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 25,371/- ఉండగా అందులో పురుషులు 12,579/- మహిళాలు,12,791/- అదర్స్ ఒక్కరు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబందించిన వివరాలు మంగళవారం మున్సిపల్ కమిషనర్ వెంకటేశం వెల్లడించారు. 

డుగురు రిటర్నింగ్ ఆఫీసర్స్ లు ఏడుగురు అసిస్టెంటెన్ట్ టర్నింగ్ ఆఫీసర్స్,  నలుగురు జెడ్‌ఓలు, ఐడుగురు రూట్ ఆఫీసర్లు, రిజర్వ్ పిఓలు, ఏపిఓలు, ఓపిఓలు కలిపి 205 మంది పనిచేస్తున్నారని వెల్లడించారు. 200మంది పోలీసు అధికారులు, 25 సెన్సిటివ్ &హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు, ఒక ప్రత్యేక అధికారి ఉన్నారు. రవాణ సౌకర్యంకు ఎనమిది బస్సులు, అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, టెంట్ బారికేడింగ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

అన్ని పోలింగ్ కేంద్రాలలో ఫ్యాన్లు, లైటింగ్, ర్యాంప్లు ఏర్పాటు చేయబడ్డాయని పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని పోలింగ్ సిబ్బంది పోలీసులకు ఆహారం, మంచినీటి వసతి, ఏర్పాట్లు చేశామన్నారు.10 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించగా ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఎటువంటి సమస్యలు లేవన్నారు.

ఓటింగ్ అనంతరం చేవెళ్లలోని చేవెళ్లలోని ‘ఎన్ ఎక్స్ టీ డబ్ల్యూఏవీ ఈ ఇన్స్టిట్యూట్ అడ్వానస్డ్ టెక్నాలజీస్ హైదారాబాద్ లో  డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు అనంతరం కౌన్సిలర్ గా గెల్పొందిన అభ్యర్థుల  ఫలితాలు వెల్లడిస్తామన్నారు. అయితే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రం ఈనెల 16న జరగనుందన్నారు.