4 May, 2026 | 2:36 AM

తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడి మృతి

04-05-2026 01:19 AM

సూర్యాపేట మే 3 (విజయక్రాంతి) : తాటిచెట్టు పైనుండి కిందపడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట మండలం కాసర బాధ గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన పోలగాని శ్రీనివాస్ (47) కల్లుగీస్థూ జీవనాన్ని సాగిస్తున్నాడు. 

ఈ క్రమంలో రోజు మాదిగానే ఆదివారం ఉదయం తన ఇంటి నుండి ముస్తాదు కట్టుకొని కల్లు గీయుటకు కాసరాబాద నుండి వెదురవారిగూడెం వెళ్ళు రోడ్డుకు పక్కన ఉన్న కొల్లు శివయ్య భూమిలో గల పరుపుతాడు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు మోకు చిలుకట్టు ఊడి చెట్టు పైనుండి పడిపోయినట్లు తెలిపారు.

దీంతో శ్రీనివాస్ మొఖానికి, చేతులకు, కడుపులో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. మృతుని భార్య పోలగానీ వసంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏ.ఎస్.ఐ పాండు నాయక్ తెలిపారు. మృతునికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.