30 July, 2026 | 2:44 PM

సిరిసిల్ల పెద్ద బజార్‌లో వర్షం బీభత్సం

30-07-2026 02:10 PM

కారుపై కూలిన వేప చెట్టు ఒకరికి గాయాలు

సిరిసిల్ల,(విజయక్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్‌లో  ఒక్కసారిగా భారీ వేప చెట్టు కూలిపోయింది. స్థానికుల కథనం ప్రకారం, రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారుపై నేరుగా చెట్టు పడింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం, పైకప్పు  దెబ్బతిన్నాయి.  కారు లోపల ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. చెట్టు కూలిన శబ్దం విన్న వెంటనే స్థానిక వ్యాపారులు, ప్రజలు అక్కడికి పరుగెత్తారు. వారు తక్షణమే స్పందించి కారులో ఇరుక్కుపోయిన వ్యక్తిని బయటకు తీసి, చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో నేల తడిసి ముద్దవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.