జిలేఖన్ చెరువులో విష రసాయనాలు
- అర్ధరాత్రి వేళల్లో మెడికల్ వ్యర్థాల అక్రమ డంపింగ్
- తీవ్ర దుర్వాసనతో ఊపిరాడని పరిస్థితి..
- రోగాల బారిన పడుతున్న బొంగ్లూరు వాసులు
- పట్టించుకోని అధికారులు.. నోరు తెరవని ప్రజాప్రతినిధులు
ఆదిభట్ల,సెప్టెంబర్ 16(విజయక్రాంతి): అది నిన్నమొన్నటి వరకు గ్రామస్తులకు(villagers), రైతులకు(Farmers) జీవనాధారంగా ఉన్న చెరువు.. కానీ నేడు విషపూరిత రసాయనాలకు, ప్రమాదకర మెడికల్ వ్యర్థాలకు(Hazardous medical waste) అడ్డాగా మా రింది. రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని బొంగ్లూరు గ్రామంలో గల జిలేఖన్ చెరువును(Jilekhan Cheruvu) కొంతమంది కలుషిత భూతంగా మారుస్తున్నారు. గత ఆరు నెలలుగా అర్ధరాత్రి వేళల్లో లారీలు, ట్యాంకర్లలో విష వ్యర్థాలను తెచ్చి యథేచ్ఛగా చెరువులో పారబోస్తున్నారు.
రోడ్డుపై వెళ్లాలంటే నరకయాతన
ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న ఈ చెరువు నుంచి వెలువడుతున్న ఘా టైన కెమికల్ వాసనకు రాకపోకలు సాగించే ప్రజలు,వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.చెరువు సమీపంలోనే నివాస గృహాలు ఉండటంతో దుర్వాసన ఇళ్లలోకి వ్యాపిస్తోంది. గాలి పీల్చుకోలేక చిన్నపిల్లలు, వృద్ధులు అస్వస్థతకు గురవుతున్నారు.
రైతుల ఆందోళన...
సమీపంలోని పొలాల్లో పనులు చేసుకునే రైతులు ఈ కెమికల్ వాసనను భరించ లేక పనులు మధ్యలోనే ఆపేసి వెళ్తున్నారు. హానికర మెడికల్ వ్యర్థాలు, రసాయనాలు చెరువు నీటిలో నానుతుండటంతో భూగర్భ జలాలు పూర్తిగా విషతుల్యమయ్యే ప్రమా దం ఏర్పడింది. దీనివల్ల చుట్టుపక్కల బోరు బావుల నీరు తాగునీటికి పనికిరాకుండా పో తుందని, భవిష్యత్తులో తీవ్రమైన శ్వాసకోశ, చర్మ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని పర్యావరణ వేత్తలు, వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.
ఫిర్యాదు చేసినా బుట్టదాఖలే.. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం
కళ్లముందే చెరువు విషపూరితంగా మా రుతున్నా, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.ఇప్పటివరకు నీటి, మట్టి నమూనా లను సేకరించకపోవడం వెనుక పెద్దల హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడొద్దు
‘రసాయనాల దుర్వాసనతో ప్రజలు ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది. అధికారులు తక్షణమే స్పందించి అక్రమంగా వ్యర్థాలు పడేస్తున్న ట్యాంకర్లను స్వాధీనం చేసుకుని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.’
పైళ్ల శ్రీనివాస్‌రెడ్డి
పోరాటాన్ని తీవ్రం చేస్తాం
‘ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా ఉంచాలి. చెరువు ను కాపాడేందుకు శాశ్వత పరిష్కారం చూపకపోతే గ్రామస్తులతో కలిసి పెద్ద ఎ త్తున ఆందోళన చేపడతాం.అర్ధరాత్రి వేళ ల్లో చెరువు వద్ద ప్రత్యేక పోలీస్ పె ట్రోలింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చే యా లి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే చెరువు నీటి పరీక్షలు ని ర్వహించాలి.విష వ్యర్థాలు వేస్తున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
మూల శివ గౌడ్