4 July, 2026 | 3:28 AM

ప్రజాక్షేత్రంలో ‘దుద్దిళ్ల’ మార్క్..

04-07-2026 02:36 AM

సర్ ప్రక్రియే లక్ష్యంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు వ్యూహాత్మక అడుగులు

సర్ పై అప్రమత్తంగా ఉండాలని బిఎల్‌ఏ లకు, సూపర్వైజర్లకు కాంగ్రెస్ కార్యకర్తలకు నిరంతరం శ్రీనుబాబు దిశ నిర్దేశం 

మంథని, జూలై 3 (విజయక్రాంతి): రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక అర్హత మాత్రమే కావచ్చు. కానీ ఆ వారసత్వాన్ని ప్రజాసేవలో సుస్థిరం చేసుకున్నప్పుడే నిజమైన నాయకుడిగా గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు సరిగ్గా ఇదే బాటలో పయనిస్తున్నారు.

తన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ళ శ్రీపాదరావు అలాగే ప్రస్తుత రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సోదరుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికీ, తనదైన శైలిలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల మనిషిగా చెదరని ముద్ర వేసుకుంటున్నారు.

లక్ష్య సాధనలో ‘శ్రీను బాబు’ స్పీడ్

ప్రతి ఇంటా ఓటరు చైతన్య పరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ స్పెష ల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను శ్రీను బాబు ఒక యజ్ఞంలా భావించి ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని నమ్మే ఆయన, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆ హక్కు కల్పించడమే ధ్యేయంగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.

 శిక్షణా తరగతులు

మంథని నియోజకవర్గ వ్యాప్తంగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ, బూత్ లెవె ల్ ఏజెంట్లకు పార్టీ సూపర్వైజర్లకు క్షుణ్ణంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటికీ కాంగ్రెస్ కేవలం నాయకులకు దిశానిర్దేశం చేయడమే కాకుండా, స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. ఒక్క అర్హత గల ఓటు కూడా జాబితా నుండి తప్పిపోకూడదనే పట్టుదలతో పని చేస్తున్నారు.

 యువతపై ప్రత్యేక దృష్టి

 కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతీ యువకులను గుర్తించి, వారిని ఓటర్లుగా నమోదు చేయించే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

 సమన్వయకర్తగా అద్భుత తీరు... క్యాడర్లో పెరిగిన జోష్

సరికొత్త వ్యూహాలతో, కార్యకర్తలను సమన్వయం చేయడంలో శ్రీను బాబు చూపి స్తున్న చొరవ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రౌండ్ లెవెల్లో ఉండే సా ధారణ కార్యకర్త నుంచి సీనియర్ నాయకుల వరకు అందరినీ కలుపుకుంటూ వెళ్లడం ఆయన ప్రత్యేకత.ఓటు అనేది కేవలం ఒక హక్కు మాత్రమే కాదు.. అది మన భవిష్యత్తును మార్చే శక్తి. ఏ ఒక్కరూ నిర్లక్ష్యం వల్ల ఓటు హక్కును కోల్పోకూడదని, ప్రతి కార్యకర్త బాధ్యతగా ప్రతి ఇంటి తలుపు తట్టాలని శ్రీను బాబు పనిచేస్తున్నారు.

ఎన్నికల సం ఘం నిబంధనల ప్రకారం దరఖాస్తులు పూర్తి చేయించడంలో ఆయన చూపిస్తున్న సాంకేతిక మరియు వ్యూహాత్మక నైపుణ్యం బిఎల్‌ఎ లకు పెద్ద దిక్కుగా మారింది. దీంతో నాయకులు, కార్యకర్తలు సరికొత్త ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోదూసుకుపోతున్నారు.

 అభినందిస్తున్న అధిష్ఠానం.. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ!

తన తండ్రి, అన్న నిలబెట్టిన రాజకీయ వారసత్వాన్ని కాపాడుతూనే, ప్రజా సేవలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంటున్నారు. శ్రీను బాబు సర్ కార్యక్రమంపై ఆయన చూపుతున్న అంకితభావం, జిల్లాల్లో పార్టీని నడిపిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సైతం ప్రత్యేక ప్రశంసలు కురిపించినట్లు సమాచారం.

అటు ప్రజా సమస్యలపై పోరాడటం, ఇటు పార్టీ అప్పగించిన బాధ్యతలను వంద శాతం విజయవంతం చేయడం ద్వారా మంథని నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే దుద్దిళ్ల శ్రీను బాబు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.