6 March, 2026 | 6:51 PM

సర్వీస్ రోడ్డుపై ట్రాఫిక్ కష్టాలు

06-03-2026 12:00 AM

దుకాణాల ఎదుట రోడ్లపైనే వాహనాల పార్కింగ్

ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులకు ఇబ్బందులు  

వాంకిడి, మార్చి 5 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని సర్వీస్ రోడ్డుపై నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. సర్వీస్ రోడ్ల వెంట ఉన్న దుకాణాల ముందు రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.

వాంకిడి మండల కేంద్రం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతిరోజూ వివిధ పనుల నిమిత్తం ప్రజలు మండల కేంద్రానికి వస్తుంటారు. దీంతో సర్వీస్ రోడ్లపై నిత్యం వందలాది ద్విచక్ర వాహనాలు, పదుల సంఖ్యలో ఆటోలు, ట్రాక్టర్లు తిరుగుతుంటాయి. ప్రతిరోజూ ఆసిఫాబాద్, మంచిర్యాల్ డిపోలకు చెందిన బస్సులు వాంకిడి మండలం మీదుగా రాకపోక లు సాగిస్తుంటాయి.

మండల కేంద్రంలోని సర్వీస్ రోడ్డులో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవడంతో బస్సు డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు సర్వీస్ రోడ్డుపై ఎదురెదురుగా పెద్ద వాహనాలు వస్తే మొత్తం రహదారి మూసుకుపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో మిగతా వాహనాలు వెళ్లేందుకు కూడా అవకాశం లేక ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. పోలీస్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి సర్వీస్ రోడ్లపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.