శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం..
హైదరాబాద్: శ్రీకృష్ణాష్టమి(Krishna Ashtami) వేడుకల సందర్భంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపు రథం విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్(Hyderabad)లోని రామంతపూర్‌లో ఈ విషాద సంఘటన జరిగింది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిన్న రాత్రి స్థానికంగా రథాన్ని ఊరేగించారు. అయితే, రథాన్ని లాగుతున్న వాహనం చెడిపోవడంతో, దానిని పక్కన పెట్టిన యువకులు.. తమ చేతులతో రథాన్ని లాగుతూ ముందుకు కదిలారు. ఈ ప్రక్రియలో, రథం విద్యుత్ తీగలకు తగిలింది.
ఫలితంగా, రథాన్ని లాగుతున్న 9 మంది యువకులు విద్యుత్ షాక్‌కు గురైయ్యారు. అపస్మారక స్థితిలోకి పడిపోయిన స్థానికులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తూ ఐదుగురు మరణించినట్లు వైద్యులు అప్పటికే నిర్ధారించారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్ మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నారని సమాచారం. మృతులు రుద్రవికాస్(39), కృష్ణ యాదవ్(21), శ్రీకాంత్ రెడ్డి(35), రాజేంద్ర రెడ్డి(45), సురేష్ యాదవ్(34) గా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.






