18-08-2025 01:57:30 AM
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ఇవాళ దేశంలో సొంతిల్లు ఉండట మనేది ఒక కోరికనో, ఓ కలనో మాత్రమే కాదని.. అదొక ఎమోషనల్ అవసరంగా మారిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నా రు. మాదాపూర్, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఆదివారం క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వినియోగదారుల అవసరాలను పూర్తిచేసేం దుకు రియల్ ఎస్టేట్ రంగం పనిచేస్తున్న తీరు ప్రతిబింబిస్తుందన్నారు.
వినియోగదారుడు బిల్డర్ వద్ద ఓ ఇంటిని కొనుక్కుని.. దాన్ని భావోద్వేగ బంధంగా మార్చుకుంటాడని పేర్కొన్నారు. అదే ఇంటితో వారి కుటుంబానికి ఏర్పడే ‘సెంటిమెంటల్ బాండ్’ అని, అందుకే సొంతింటి కల నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషిచేస్తుంటారని తెలిపారు. కస్టమర్ల కలను సాకారం చేయడం.. రియల్ ఎస్టేట్ రంగం, రెగ్యులేటర్స్, రాష్ర్ట ప్రభుత్వాలు, కేంద్ర ప్రభు త్వం.. ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర మం త్రి పేర్కొన్నారు.
ఈ విషయాన్ని కేంద్ర ప్రభు త్వం దృష్టిలో ఉంచుకుని రియల్ ఎస్టేట్ రం గం ఆకాంక్షలతో పాటుగా ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను కూడా కాపాడే దిశగా కృషి చేస్తోందన్నారు. వినియోగదారు ల ప్రయోజనాలను, రియల్ ఎస్టేట్ రంగం లో పారదర్శ కత, జవాబుదారీతనాన్ని సమన్వయం చేసే ఉద్దేశంతో 2016లో రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్)ను కేంద్రం తీసుకొచ్చిందన్నారు.
తమ జీవితమం తా కష్టపడి సంపాదించిన మొత్తాన్ని వెచ్చింది తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని చూస్తారని అన్నారు. అలాంటప్పుడు వారి ఆ కాంక్షలను నెరవేర్చాలని, వారి హక్కును వారి కి ఇబ్బందుల్లేకుండా అందించాలనేది ప్రధాని మోదీ ఆలోచనగా ఆయన పేర్కొన్నారు. చాలా ఏళ్ల తర్వాత, 2024లో తెలంగాణ ప్రభుత్వం.. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఓ శాశ్వత నియంత్రణ వ్యవస్థను, ఓ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు.
తెలంగాణలో 10వేల ప్రాజెక్టులు
ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 10వేల ప్రాజెక్టులు, 4వేల మంది ఏజెంట్లు రెరాలో రిజిస్టర్ అయ్యారని ఆయన తెలిపారు. గత 11 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎకనమిక్ పాలసీలు, ప్రొసీజర్ల కారణంగా మ ధ్యతరగతితో పాటుగా రియల్ ఎస్టేట్ రంగానికి చాలా మేలు జరిగిందన్నారు. ఈ 11 ఏళ్ల నిర్ణయాల కారణంగా 20 కోట్ల మంది అత్యంత పేదరికం నుంచి బయటకు వచ్చారని పేర్కొన్నారు.
పీఎం ఆవాస్ యోజన, స్వచ్ఛభారత్, పీఎం ఉజ్వల, ఆయుష్మాన్ భారత్ వంటి వివిధ కార్యక్రమాల ప్రభావం ద్వారా స్పష్టమైన ఫలితాలను కేంద్రం అందిస్తోందని తెలిపారు. ఇలాంటి పథకాల కార ణంగానే.. పేదలు తమ ఆర్థిక స్తోమతను పెం చుకుని, పేదరిక సంకెళ్లను తెంచుకుని, ‘మధ్యతరగతి’ వర్గంలోకి చేరుతున్నారని తెలిపా రు. మధ్యతరగతి వర్గం పెరగడంతో సొంతింటి కల కూడా పెరుగుతోందని ఆయన విశ్లేషించారు.
మధ్యతరగతి చేతుల్లో డబ్బు మిగులు
మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను గుర్తి స్తూ.. తీసుకొచ్చిన పలు నిబంధలను.. ఈ వర్గానికి అండగా నిలుస్తున్నాయని... రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు కారణంగా మధ్యతరగతి చేతుల్లో కొంత డబ్బు మిగులుతోందని కిషన్‌రెడ్డి అన్నారు. వారు ఈ అవకాశాన్ని సొంతింటి కల నెరవేర్చుకునేందుకు పెట్టుబడిగా పెట్టేందుకు వీల వుతోందని వెల్లడించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంతోపాటుగా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా హోమ్‌లోన్ ఈ ఎంఐలు చెల్లించడం కూడా సులభమైందన్నారు.
ఇలాంటి ఎన్నో నిర్ణయాలు అటు మధ్యతరగతిని ఇటు రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేవిగా ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో.. జీఎస్టీ శ్లాబ్స్‌ను తగ్గించబోతున్నట్లు ప్రకటించారని ఫలితంగా వస్తువులు, సేవలపై పన్నులు మరింత తగ్గుతాయన్నారు. కామన్ మ్యాన్ డబ్బు మరింత ఆదా అవుతుందన్నారు.
‘ఈజ్ ఆఫ్ లివింగ్’
‘ఈజ్ ఆఫ్ లివింగ్’ మోదీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యాల్లో ఒకటని, అందుకే పట్టణాలు, నగరాల్లో ప్రజలు నివసించడానికి అనుకూలమైన వసతులను ప్రోత్సహిస్తోందని, ఈ ప్రయత్నంలో రియల్ ఎస్టేట్ రంగంపై బాధ్యత ఎక్కువగా ఉందన్నారు. క్రెడాయ్ ఈ దిశగా చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లోనూ పనిచేస్తూ.. ‘వికసిత్ భారత్ - 2047’ లక్ష్యాలను చేరుకోవడంలో కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రానికి అంతర్జాతీయస్థాయి రోడ్లను మంజూరు చేశామని తెలిపారు. వరంగల్‌కు మామునూరు ఎయిర్ పోర్టు, ఆదిలాబాద్‌లో ఉన్న డిఫెన్స్ ఎయిర్ పోర్టును సివిల్ ఎయిర్ పోర్టుగా మార్చామని వెల్లడించారు. ఎంఎంటీఎస్ రైళ్లను ఏసీ రైళ్లుగా మారుస్తామని పేర్కొన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో మెట్రో 2వ దశ పెండింగ్ లో ఉందని, త్వరలోనే దానికి కూడా అనుమతులు వస్తాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.