13 July, 2026 | 5:50 PM

Breaking News

జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి   •   గుడుంబా తయారీకి బెల్లం తరలింపు.. 7 టన్నులు పట్టివేత   •   పిట్టంపల్లి గ్రామంలో పరిశ్రమల కాలుష్యంపై కలెక్టర్‌కు వినతి   •   పాఠశాల ఆవరణలో మహిళా సమాఖ్య భవన నిర్మాణాన్ని నిలిపివేయాలి   •   ఎఫ్‌ఎల్‌ఎన్ బేస్‌లైన్ పరీక్షల నిర్వహణపై ఉపాధ్యాయులకు శిక్షణ   •   ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణింపు   •   జాతీయ నులిపురుగుల మాత్రల పంపిణీ   •   కళాకారుల విభాగం నియోజక వర్గం అధ్యక్షుడిగా ఎనగందుల దత్తు   •   గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన విద్యార్థులను అభినందనలు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •  

పయనాలు ఏ హిమాలయాలకో..

26-03-2025 12:12 AM

రూపేశ్ కథానాయకుడిగా మా ఆయి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మి స్తున్న సినిమా ‘షష్టిపూర్తి’. రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులు. ఆకాంక్ష సింగ్ కథానాయిక. పవన్‌ప్రభ దర్శకుడు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శ కుడు. ఆయన సంగీత సారథ్యంలో తొలి సారి ఎంఎం కీరవాణి ఓ పాటను ఈ సినిమా కోసం రాశారు. ఈ గీతాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ విడుదల చేశారు.

‘ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం.. నీదో నీవల్ల నాదో ఈ పరవశం.. రాగం నీదై పల్లవి నాదై.. చరణం చరణం కలిసిన వేళ.. పయనాలు ఏ హిమాలయాలకో..’ అంటూ హృద్యంగా సాగుతోం దీ పాట. దీన్ని అనన్య భట్ ఆలపిం చారు. ఈ చిత్రానికి డీవోపీ: రామ్; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్టంట్స్: రామకిషన్.