3 June, 2026 | 5:12 PM

గిరిజన కళాశాల పూర్వ విద్యార్థుల ఫోరం-

03-06-2026 04:28 PM

ప్రతిభ చూపిన విద్యార్థులకు ఘన సన్మానం 

కొత్తగూడెం,(విజయక్రాంతి): ఏజెన్సీ గిరిజన పట్టభద్రుల సంక్షేమార్థం 2000 సంవత్సరంలో భద్రాచలం ఐటీడీఏ సంస్థ నెలకొల్పిన గిరిజన విద్యా కళాశాల పూర్వ విద్యార్థులు దాదాపు అందరూ స్థిరపడ్డారు. కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో స్కూల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న తారాచంద్, మోహన్ రావు, శంకర్, నరేష్ బాబు, నరసింహారావు, శ్రీనివాస్ కబీర్దాస్, నరేంద్రబాబు, మోహన్  లు ఒక ఫోరంగా ఏర్పడి, కొత్తగూడెం స్థాయిలో గత పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎండి జైనాబ్ (556/600) పాత కొత్తగూడెం, ఎం.ప్రత్యూష (545/600) ఆనందఖని, పి. శ్రీలేఖ (537/600) ఆనంద ఖని విద్యార్థినులను, తల్లిదండ్రులను కొత్తగూడెం తహసిల్దార్ పుల్లయ్య, డిటి అంజద్ పాషా,  శంకర్ రావులు పూర్వ ప్రిన్సిపాల్ గిరిజన బిఈడి కళాశాల డాక్టర్ ప్రభుదయాల్ ఆధ్వర్యంలో బుధవారం రోజున నగదు పురస్కారంతో పాటు, ఫైల్స్, రాత పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు అందించి, ఇదే స్ఫూర్తితో ఉన్నత విద్యను కొనసాగించాలని కోరారు.

అనంతరం పలువురు అధికారులు  మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధికై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అనేక విద్యార్థులకు ప్రేరణగ నిలిచే ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. రెట్టింపు ఉత్సాహంతో విద్యా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. పూర్వ రాష్ట్ర పరిధిలో గల అన్ని ఐటిడిఏ ప్రాంతాల్లో పనిచేస్తున్న శిష్యులకు ఇదే తరహాలో విద్యార్థులను ప్రోత్సహించేలా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించేలా, ప్రోత్సాహిస్తునట్లు పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభుదయాల్ వెల్లడించారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహించడం పట్ల పలువురు గిరిజన ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ మిత్రబృందం పాల్గొన్నారు.