11-02-2026 01:48:23 AM
వార్డెన్‌ల తీరుపై జూమ్ మీటింగ్‌లో ఆగ్రహం...
డైట్ బిల్లులను నిలిపివేయాలని ఐటీడీఏ పీవో ఆదేశం...
ఆదిలాబాద్/ఉట్నూర్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో కొనసాగుతున్న ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థుల హాజరుపై గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని ఉట్నూర్, భద్రాచలం, ఏటూరు నాగారం, మన్ననూర్ ఐటీడీఏల పరిధిలోని ఆశ్రమ పాఠశాలలతో పాటు వివిధ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో ఉంటూ విద్యనభ్యసించే విద్యార్థుల హాజరు శాతంపై సోమవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశంలో పాఠశాలల ప్రారంభోత్సవం తర్వాత ఆశ్రమా పాఠశాలలో చేరిన విద్యార్థుల సంఖ్య, ప్రస్తుతం విద్యతో పాటు కల్పించే భోజనంపై, విద్యార్థుల హాజరు శాతం తదితర వివరాలను సేకరించారు. రాష్ట్రంలోని 50 ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల హాజరు రిజిస్టర్‌లో, ఆన్లైన్ ద్వారా పంపించిన పట్టికలో వ్యత్యాసం ఉండడంతో ఆయా ఆశ్రమ పాఠశాలల నిర్వాహకులపై జాయింట్ డైరెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఉట్నూర్‌లో ని క్రీడా పాఠశాల విద్యార్థుల హాజరులో వ్యత్యాసం రావడంతో వారిపై అగ్రహం వ్యక్తం చేసినట్లు ఇతర ఆశ్రమ పాఠశాలల నిర్వాహకులు చర్చించుకుంటున్నారు. రెండు రోజుల్లో విద్యార్థులు చేరిన తరవాత ప్రస్తుత హాజరు వివరాలను వెంటనే పంపించాలని ఆశ్రమ పాఠశాల నిర్వాహకులకు జాయింట్ డైరెక్టర్ ఆదేశించారు.
ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల వివరాలు, గైర్హాజరు వివరాలను సేకరణలో వార్డెన్లు నిమగ్నమయ్యారు. కొన్ని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు హాజరుగా ఉన్న వారి వద్ద ఆధార్ కార్డు లేకపోవడంతో భోజనాల జాబితాలో పేర్లను నమోదు చేయలేక పోయామని, ఆ విద్యార్థులు ఆశ్రమ పాఠశాలలో ఉండి విద్యను అభ్యసిస్తూ ఉన్నారని నిర్వాహకులు అంటున్నారు.
ఆశ్రమ పాఠశాలలో ప్రవేశం తీసుకున్న సమయంలో విద్యార్థులు ఆధార్ కార్డులు సమర్పించకపోవడం తో భోజనాలు వడ్డించడంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని ఆశ్రమ పాఠశాల నిర్వా హకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు భోజనాలు చేసిన విద్యార్థుల హాజరు, వారి చిత్రాలను ఆన్లైన్ ద్వారా గిరిజన సంక్షేమ శాఖకు పంపిస్తున్నామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. కొంతమంది విద్యార్థుల ఆధార్ కార్డులు లేకపోవడంతో అధికారులను ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆశ్రమ నిర్వాహకులు వాపోతున్నారు..
డైట్ బిల్లులను నిలిపివేయాలి...
ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని 124 ఆశ్రమ పాఠశాలల డైట్ బిల్లును నిలిపివేయాలని జిల్లా ట్రెజరీ అధికారులకు ఐటిడిఏ పిఓ యువరాజ్ మార్మట్ లేఖ పంపినట్లు ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ప్రతి నెల పంపే బిల్లులను జిల్లా ట్రెజరీ అధికారులు పాస్ చేయవలసి ఉంటుందని, అప్పు డే ఖర్చు చేసిన బిల్లులు చేతికి కందుతాయి.
గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి విద్యార్థుల హాజరుపై పలు సందేహా లను వ్యక్తం చేయడంతో ఐటీడీఏ పీవో బిల్లు ను నిలుపుదలపై నిర్ణయం తీసుకున్నారని ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు అంటున్నారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల హాజరుపై జరిగిన జూమ్ సమావేశంపై జిల్లా గిరిజన సం క్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అంబాజీ జాదవ్ వివరణ కోరెందుకు పలుసార్లు ప్రయత్నించిన ఆయన అందుబాటులోకి రాలేదు.