ప్లాన్‌తో చదవాలి.. విద్యార్థులకు డీడీ క్లాస్!
ఆసిఫాబాద్, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల బాలురను గిరిజన సంక్షేమ శాఖ డీడీ జాదవ్ అంబాజీ గురువారం ఆకస్మికంగా తనిఖీ(Inspection) చేశారు. పాఠశాలలో ప్రారంభమైన ఎస్ఏ-1 పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల హాజరు, పరీక్షల నిర్వహణ, వసతి గృహం, భోజనశాల, వంటశాల, పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు, భద్రతా చర్యలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి విద్య, భోజనం, వసతి, ఆరోగ్యం, పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని(Study Plan) సూచించారు. నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, మెరుగైన వసతి సౌకర్యాలు అందేలా సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. పాఠశాల రికార్డులు, హాజరు తదితరాలను పరిశీలించి విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, వార్డెన్ లక్ష్మయ్య, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు