22 March, 2026 | 3:38 PM

ఘనంగా శాలివాహన జయంతి వేడుకలు

22-03-2026 01:03 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో శాలివాహన కుల ఆరాధ్య దైవం శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం రోజు శాలివాహన చక్రవర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం అధ్యక్షుడు వంగపల్లి పరశురాములు మాట్లాడుతూ... ప్రపంచ రాజకీయ చరిత్రలో అనేక మంది చక్రవర్తులు, రాజులు, ప్రధాన మంత్రుల జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తామని, అయితే "శక పురుషుడు" అనే బిరుదు కేవలం శాలివాహనుడికే దక్కిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కాశీరాం, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, వంగపల్లి శ్రీనివాస్, వంగపల్లి రామ్ మనోహర్, గుమ్మడిదారి దుర్గయ్య, కనకయ్య, భిక్కనూరి సత్తయ్య, నారాయణ, ఇద్దగిరి కిషన్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.