ఘనంగా TRSMA ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

13-09-2026 | 01:01am

జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon District) TRSMA ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు వేడుకలు(Best Teachers Award Ceremony), జనగామ-సూర్యాపేట రోడ్డులోని భ్రమరాంబ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగాయి. జిల్లాలోని 60 పాఠశాలల నుండి 120 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. రాష్ట్ర అధ్యక్షులు సదుల మధుసూదన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల భద్రతకు ప్రత్యేక పాఠశాల పరిరక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. టీచర్ యాప్‌ను 3,500 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని, 150 ఉచిత కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.జిల్లా అధ్యక్షులు పి. వెంకట్ రెడ్డి, కార్యదర్శి రాపాక విజయ్, కోశాధికారి పి. ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రమేష్ రావు, రాఘవేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు