30 March, 2026 | 2:34 AM

రెండుచోట్ల టీవీకే అధినేత విజయ్ పోటీ

30-03-2026 12:52 AM
  1. అభ్యర్థుల జాబితా ప్రకటన

మాజీ డ్రైవర్, పీఏ కుమారులకు టికెట్లు 

అవినీతికి పాల్పడబోం, ఒక్కఛాన్స్ ప్లీజ్: విజయ్

చెన్నై, మార్చి 29: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీవీకే (తమిళగ వెట్రి కజగం) అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రకటించారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్ల నుంచి విజయ్ పోటీలో నిలవనున్నారు. ఆదివారం చెన్నైలో జరిగిన సభలో జాబితాను విడుదల చేశారు. తన పార్టీ అభ్యర్థులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారని, రక్షకులని, రాజకీయ దిగ్గజాలు కాదని అన్నారు.

డీఎంకే, టీవీకే మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. కాగా విజయ్ ప్రకటించిన అభ్యర్థుల్లో ఒకరు తన పీఎ అయిన రాజేంద్రన్ కుమార్ శబరినాథన్ ఉండగా, మరొకరు ఆయన మాజీ డ్రైవర్ కుమారుడు కావడం గమనార్హం. తాము గెలిచాక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయమని, అవినీతికి పాల్పబోమని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించబోమన్నారు.

తమిళనాడును మాదకద్రవ్య రహితంగా మారుస్తామని టీవీకేకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజయ్ విజ్ఞప్తి చేశారు. టీవీకే మ్యానిఫెస్టోలో పలు గ్యారంటీలను ఇచ్చింది. 29 ఏళ్లు పైబడిన నిరుద్యోగులకు నెలకు రూ. 4వేలు, డిప్లోమా హోల్డర్లకు రూ. 2500 ఇస్తామని ప్రకటించారు. 12వ తరగతి నుంచి పీహెచ్ డీ వరకు రూ. 20 లక్షల పూచీకత్తు లేని రుణాలు, 75 శాతం స్థానిక కార్మికులను నియమించుకునే సంస్థలకు ప్రోత్సాహకాలు తదితరాలు ప్రకటించారు.