11 June, 2026 | 3:07 AM

ఇరవై వేల పోలీస్ ఉద్యోగాలు ఇవ్వాలి

11-06-2026 02:29 AM
  1. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లలో భర్తీల సంఖ్యను పెంచాలి 
  2. దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల ఆందోళన 
  3. ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు 

ఎల్బీనగర్, జూన్ 10 : పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లలో పోస్టుల భర్తీ సంఖ్యను 5 వేల నుంచి 20 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు బుధవారం సాయం త్రం దిల్ సుఖ్ నగర్ లో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. నిరసన తీవ్రతరం కావడంతో సరూర్ నగర్ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితు లు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా నిరుద్యోగుల జేఏసీ నాయకులు ఇంద్రానాయక్, కుమార్, ఆకాష్, శంకర్, శంబు, నవీన్, ఉపేందర్, సింధు, విక్రమ్, దామోదర్ రెడ్డి, అశోక్, సాల్మన్ తదితరులు మాట్లాడారు.  ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటించి, నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  జీవో 29, జీవో 46లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  తక్షణమే పది వేల పోలీస్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.