21 August, 2026 | 2:11 AM

వామన్‌రావు హత్య కేసులో ట్విస్ట్!

21-08-2026 12:06 AM

పుట్ట మధును విచారణ కోసం పిలిచిన సీబీఐ?

మంథనిలో తీవ్ర ఉత్కంఠ

మంథని, ఆగస్టు 20 (విజయక్రాంతి): పెను సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామ న్ రావు, నాగమణి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధును సీబీఐ అధికారులు గురువారం మళ్లీ విచారణ కోసం పిలిచినట్లు సమాచారం. గతంలో ఈ కేసుకు సంబంధించి పుట్ట మధు భార్య శైలజను సీబీఐ అధికారులు లోతుగా విచారించడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మధును కూడా సీబీఐ విచారిస్తున్నట్లు వార్తలు వెలువడటంతో మంథని నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.