నిండు జీవితానికి రెండు చుక్కలు
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు, జూన్ 28 (విజయక్రాంతి): మున్సిపాలిటీలోని 10వ వార్డులో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డిలతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్యవంతమైన జీవితానికి, బంగారు భవిష్యత్తుకు జీవితాంతం రక్షణ కవచంలా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. బిడ్డ అంగవైకల్యాన్ని ఎదుర్కొనేందుకు పోలియో చుక్కలు ఏకైక మార్గమని, పోలియో రహిత సమాజ స్థాపన కోసం తల్లిదండ్రులంతా తమ పిల్లలకు విధిగా చుక్కలు వేయించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గీత, వైద్యాధికారులు, ఆశా వర్కర్లు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.






